HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Maheshbabu Next Movie Crazy Update

Maheshbabu: టాలీవుడ్ ట్రెండింగ్.. మహేష్, త్రివిక్రమ్‌ల కాంబోలో హ్యాట్రిక్ మూవీ..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్ట‌ర్ ప‌ర‌శురామ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం “స‌ర్కారు వారి పాట‌”.

  • Author : HashtagU Desk Date : 03-02-2022 - 12:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mahebabu Trivikram
Mahebabu Trivikram

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్ట‌ర్ ప‌ర‌శురామ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం “స‌ర్కారు వారి పాట‌”. మొద‌ట ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేద్దామ‌ని మేక‌ర్స్ ప్లాన్ చేయ‌గా, క‌రోనాతో పాటు ఇత‌ర కార‌ణాల వ‌ల్ల పోస్ట్ పోన్ అవ‌గా, తాజాగా స‌మ్మ‌ర్‌కు ఈ సినిమాను విడుద‌ల చేసేందుకు నిర్మాత‌లు ప్ర‌య‌త్నిస్తున్నారు.ఇక మ‌రోవైపు ఇప్ప‌టి మ‌హేష్ త‌న త‌ర్వాతి చిత్రం భారీగా ప్లాన్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ త‌న త‌ర్వాత చిత్రం చేయ‌నున్నాడ‌నే టాక్ టాలీవుడ్ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పుటికే ప్ర‌ముఖ ర‌చయిత విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ క‌థ‌ను సిద్ధం చేశార‌ని, ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఈ సినిమా తెర‌కెక్క‌నుంద‌ని, మ‌హేష్ గ‌త మూవీస్‌కి భిన్నంగా, అడ్వెంచ‌ర్లు ఎక్కువ‌గా ఉండ‌బోతున్నాయని స‌మాచారం.

Trivikram Movie2

అయితే ఇప్పుడు అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. మ‌హేష్ మ‌రో చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్‌బాబు ఇప్ప‌టికే అత‌డు, ఖ‌లేజ చిత్రాల్లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు ముచ్చ‌ట‌గా మూడోసారి ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో సినిమా తెర‌కెక్క‌బోతుంది. ఖ‌లేజ అంత‌గా స‌క్సెస్ కాక‌పోవ‌డంతో, ఈసారి భారీ హిట్ కొట్టాల‌ని త్రివిక్ర‌మ్ ప‌క్కాగా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడ‌ని స‌మాచారం.

Trivikram Movie1

ఇప్ప‌టికే క‌థా చ‌ర్చ‌లు పూర్త‌వ‌గా త్రివిక్ర‌మ్ చెప్పిన లైన‌ప్ న‌చ్చ‌డంతో మ‌హేష్ వెంట‌నే ఈ మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం, పూజా కార్య‌క్ర‌మం కూడా జ‌రిగిపోవ‌డం, చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. హైద‌రాబాద్‌లో రామానాయుడు స్టూడియోస్‌లో అట్ట‌హాసంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ పూజా కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి మ‌హేష్ స‌తీమ‌ణి న‌మ్ర‌త‌, బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే, నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీలు హాజ‌రు అయ్యారు. ఇక ఈ సినిమా త్వ‌ర‌లోనే సెట్స్ పైకి తీసుకెళ్ళేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • maheshbabu
  • tollywood
  • Trivikram

Related News

Actress Sneha

షాకింగ్ నిజాలు చెప్పిన హీరోయిన్ స్నేహ..

Actress Sneha  తెలుగు వెండితెరపై తనదైన అభినయంతో హోమ్లీ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న నటి స్నేహ, తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఒక భయంకరమైన ప్రమాదం గురించి సంచలన విషయాలను పంచుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త విరామం ఇచ్చిన ఈమె, అంతకుముందే ఒకానొక దశలో తన సినీ ప్రయాణం ముగిసిపోయిందని భావించినట్లు వెల్లడించారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో జరిగిన ఒక ఘోర ప్రమాదం తన జీవితాన్ని

  • Actor Sivaji Raja's Father G. Ramaraju Passes Away

    నటుడు శివాజీరాజా తండ్రి రామరాజు కన్నుమూత

  • Peddi

    రామ్ చ‌ర‌ణ్ పెద్ది మూవీ నుంచి రెండో సాంగ్ విడుద‌ల‌!

  • Rashmika-Vijay Wedding

    విజ‌య్ దేవ‌ర‌కొండ‌- ర‌ష్మిక పెళ్లి ఫొటోలు ఇవే!

  • Rashmika Mandanna- Vijay Deverakonda

    విజ‌య్ దేవ‌ర‌కొండ‌- ర‌ష్మిక వివాహం.. మీడియాకు మిఠాయిల పంపిణీ!

Latest News

  • BJP : బీజేపీ చేతికి బిహార్ పగ్గాలు!

  • Iran-Israel War : మరోసారి రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్

  • ఇంగ్లండ్‌తో సెమీఫైన పై గంభీర్-సూర్య మైండ్ గేమ్..

  • Gold Price : దిగొస్తున్న పసిడి.. 4 రోజుల్లో రూ. 10 వేలు తగ్గిన బంగారం ధర

  • Holi : అక్కడ హోలీ పండగంటే..ఆ గ్రామంలో రక్తం ప్రవహించాల్సిందే !!

Trending News

    • కొత్త సుప్రీం లీడర్ ఇత‌నే.. ఆయ‌న ఆస్తి విలువ ఎంతో తెలుసా?!

    • ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి తుది వీడ్కోలు.. ఖ‌న‌నం ఎక్క‌డంటే?

    • రెండు వేల రూపాయ‌ల నోట్లు ఇంకా ఎందుకు బయట ఉన్నాయి?

    • రేపే భార‌త్‌- ఇంగ్లాండ్ సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌.. ఈ ఆట‌గాళ్ల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే!

    • ఇరాన్‌ లో ఓ వైపు యుద్ధం, మరోవైపు భూకంపం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd