Mahesh Babu: జక్కన్న మూవీ కోసం మరింత స్టైలిష్ గా కనిపించబోతున్న మహేష్.. లేటెస్ట్ ఫోటోస్ వైరల్?
- By Sailaja Reddy Published Date - 10:00 AM, Tue - 2 April 24
టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు, దర్శకదీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్లో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ ప్రాజెక్టు పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఆ సినిమా ఇంకా మొదలుపెట్టకు ముందే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడం ఖాయం అని చెప్పేసారు మహేష్ అభిమానులు. అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు దర్శకుడు రాజమౌళి. మరి ఈ సినిమా విషయంలో ఏ చిన్న బజ్ వచ్చినా సెన్సేషన్ గా మారుతోంది. కాగా రాజమౌళి ప్రస్తుతం స్క్రిప్ట్ ఫైనల్ చేయడంతో పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారు.
ఆర్టిస్టులను ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. దీంతో పాటు షూటింగ్ లొకేషన్లు, ఎప్పుడు ఏం చేయాలనేది ప్లాన్ చేస్తున్నాడు. ఎవరికి వాళ్లు బిజీగా ఉన్నారు. ఇక ఇటీవలే మహేష్ బాబు విదేశాలకు వెకేషన్‌కి వెళ్లి వచ్చారు. మళ్లీ వర్క్ పై ఫోకస్ పెట్టాడు. తాజాగా మహేష్ బాబుకి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్ల మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. ఇందులో మహేష్ బాబు లుక్ మాత్రం అదిరిపోయింది. ఇందులో మరింత స్టైలిష్ గా అందంగా కనిపిస్తున్నారు. ఫ్యాన్స్ ఫిదా అయ్యేలా చేస్తున్నారు.
ఓట్టో బ్రాండ్ క్లాత్స్ ప్రమోషన్లో భాగంగా మహేష్ బాబు ఈ ప్రమోషన్స్ కోసం ఆయన ఫోటో షూట్ చేశారు. ఇందులో ఆయన హ్యాండ్సమ్గా కనిపిస్తున్నారు. కాజ్వల్స్ లో మహేష్ మరింత యంగ్‌గా ఉన్నారు. గ్రీన్ టీషర్ట్ లో సూపర్ స్టార్ లుక్ కేక అనిపించేలా ఉండటం విశేషం. ఈ లుక్స్ పై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. స్టైలిష్ లుక్ లో మహేష్ బాబుని చూసిన అభిమానులు ఈ వయసులో కూడా ఇంత యంగ్ కనిపించడం ఎలా? అది మీకు మాత్రమే సాధ్యం మహేష్ బాబు అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆ ఫోటోలలో మహేష్ బాబు 25 ఏళ్ల కుర్రాడు లాగే కనిపిస్తున్నాడు. మహేష్ ని చూసి అబ్బాయిలు సైతం కుళ్ళుకునే విధంగా అంత స్టైలిష్ గా కనిపిస్తున్నాడు మహేష్ బాబు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇకపోతే మహేష్ బాబు నెక్స్ట్ రాజమౌళితో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కూడా మహేష్ బాబు బాగా కనిపించనున్నాడని ఏకంగా తొమ్మిది గెటప్స్ లో మనకు మహేష్ కనిపించబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వినిపించాయి. అయితే మహేష్ బాబు లేటెస్ట్ ఫొటోస్ వైరల్ అవ్వడంతో ఈ లుక్ అంతా రాజమౌళి సినిమా కోసమే అంటూ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు.
Related News
Mahesh Babu : మహేష్ మంజుల వైరల్ అవుతున్న వీడియో..!
Mahesh Babu రాజమౌళి సినిమా కోసం మహేష్ లాంగ్ హెయిర్ పెంచుకుంటున్నాడు. మొన్నటిదాకా క్యాప్ పెట్టుకుని కనిపించిన మహేష్