Srimanthudu Issue Team Request to Media : శ్రీమంతుడు ఇష్యూ.. ఫైనల్ గా టీం ఏమంటుంది అంటే..!
Srimanthudu Issue Team Request to Media కొరటాల శివ మహేష్ కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు సినిమా కథ రైటర్ శరత్ చంద్ర రాసిన చచ్చేంత ప్రేమకు కాపీ అని వాదనలు
- Author : Ramesh
Date : 01-02-2024 - 10:43 IST
Published By : Hashtagu Telugu Desk
Srimanthudu Issue Team Request to Media కొరటాల శివ మహేష్ కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు సినిమా కథ రైటర్ శరత్ చంద్ర రాసిన చచ్చేంత ప్రేమకు కాపీ అని వాదనలు తెలిసిందే. రీసెంట్ గా సుప్రీం కోర్ట్ కూడా శరత్ చంద్ర ఫిర్యాధుపైనే బలం ఉందన్నట్టు చెప్పుకొచ్చింది. అంతేకాదు దర్శకుడు కొరటాల శివ విచారణకు రవాల్సి ఉంటుందని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వివాదంపై చిత్ర యూనిట్ స్పందించింది.
We’re now on WhatsApp : Click to Join
శ్రీమంతుడు, చచ్చేంత ప్రేమ రెండూ కూడా పబ్లిక్ డొమైన్ లో అందుబాటులో ఉన్నాయి. ఇవి వేటికవే ప్రత్యేకం. ఆ కథ చదివి.. సినిమా చూసి ఈ వస్తవాన్ని గుర్తించవచ్చు. ఐతే ప్రస్తుతం ఈ ఇష్యూ లీగల్ రివ్యూలో ఉంది. అందుకే అప్పుడే ఒక అభిప్రాయానికి రావొద్దని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఓపిక పట్టండని చట్టపరమైన ప్రక్రియ మీద నమ్మకం ఉందని వారు రాసుకొచ్చారు.
ఇక శరత్ చంద్ర కూడా ఆమధ్య ఓ ఇంటర్యూలో సినీ పెద్దలు రాజీ కుదర్చడానికి ప్రయత్నించారని చెప్పారు. శరత్ చంద్రకి 15 లక్షలు ఇస్తామని అన్నారని శరత్ చంద్ర అన్నారు. 2015 లో రిలీజైన శ్రీమంతుడు సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా రిలీజైన 8 నెలల తర్వాత రైటర్ శరత్ చంద్ర ఈ సినిమాపై ఫిర్యాదు చేశాడు. ఇన్నేళ్ల నుంచి ఈ కేసు నడుస్తూనే ఉంది.
Also Read : Naturalstar Nani : ఓజీ డైరెక్టర్ తో నాని.. కాంబో కుదిరితే మాత్రం నాని లెవె మారినట్టే..!