Naturalstar Nani : ఓజీ డైరెక్టర్ తో నాని.. కాంబో కుదిరితే మాత్రం నాని లెవె మారినట్టే..!
Naturalstar Nani న్యాచురల్ స్టార్ నాని సినిమాల ప్లానింగ్ చూస్తే ఎవరికైనా భలే ముచ్చటేస్తుంది. నూతన దర్శకులకు అవకాశం ఇస్తూ తను సక్సెస్ అవుతూ తనతో పనిచేసే వారికి సక్సెస్
- By Ramesh Published Date - 10:28 PM, Thu - 1 February 24

Naturalstar Nani న్యాచురల్ స్టార్ నాని సినిమాల ప్లానింగ్ చూస్తే ఎవరికైనా భలే ముచ్చటేస్తుంది. నూతన దర్శకులకు అవకాశం ఇస్తూ తను సక్సెస్ అవుతూ తనతో పనిచేసే వారికి సక్సెస్ అందిస్తుంటాడు నాని. లాస్ట్ ఇయర్ దసరా, హాయ్ నాన్న రెండు హిట్లు కొట్టగా రెండు సినిమాలు కూడా కొత్త దర్శకులతో చేసినవే అవ్వడం విశేషం.
We’re now on WhatsApp : Click to Join
ప్రస్తుతం వివేక్ ఆత్రేయతో సరిపోదా శనివారం సినిమా చేస్తున్నాడు నాని. ఆ సినిమా తర్వాత బలగం వేణు డైరెక్షన్ లో సినిమా చేస్తాడని టాక్.
దానితో పాటుగా స్టార్ డైరెక్టర్ సుజిత్ తో కూడా ఒక సినిమా ఉంటుందని తెలుస్తుంది. రన్ రాజా రన్ తో డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన సుజిత్ తన సెకండ్ సినిమానే ప్రభాస్ తో సాహో చేశాడు. ఇక థర్డ్ ప్రాజెక్ట్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ చేస్తున్నాడు.
ఈ సినిమా తర్వాత నానితో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చేయాలని అనుకుంటున్నాడట సుజిత్. పవన్ సినిమా ఓజీతో మరోసారి పాన్ ఇండియా రేసులో నిలుస్తున్న సుజిత్. నాని సినిమాను కూడా అదే పాన్ ఇండియా వైడ్ గా చేయాలని చూస్తున్నాడు. నాని సుజిత్ ఈ కాంబినేషన్ నిజంగా కొత్తగా ఉంటుంది. మరి ఈ ఇద్దరు కలిసి ఎలాంటి సినిమాతో వస్తారన్నది చూడాలి.
Also Read : Kurchi Madatapetti Video Song : గుంటూరు కారం కుర్చీ మడతపెట్టి సాంగ్ వచ్చేసింది..!