Mahesh Babu : అయిదు సినిమాలతో ఆ రికార్డ్ సెట్ చేసిన ఏకైక హీరో మహేష్.. ఏంటా రికార్డ్?
ఇప్పుడు హీరోలంతా పాన్ ఇండియా సినిమాలంటూ వెళ్తున్నా మహేష్(Mahesh Babu) మాత్రం ఇప్పటివరకు రీజనల్ సినిమాలే చేసుకుంటూ వచ్చాడు. కానీ ఆ రీజనల్ సినిమాలతోనే రికార్డులు సెట్ చేస్తున్నాడు.
- Author : News Desk
Date : 18-01-2024 - 9:45 IST
Published By : Hashtagu Telugu Desk
ఇప్పుడు హీరోలంతా పాన్ ఇండియా సినిమాలంటూ వెళ్తున్నా మహేష్(Mahesh Babu) మాత్రం ఇప్పటివరకు రీజనల్ సినిమాలే చేసుకుంటూ వచ్చాడు. కానీ ఆ రీజనల్ సినిమాలతోనే రికార్డులు సెట్ చేస్తున్నాడు. 100 కోట్ల గ్రాస్ తెచ్చుకోవాలని చిన్న హీరోలు సైతం పాన్ ఇండియా అని అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. కానీ మహేష్ కేవలం తెలుగులోనే రిలీజ్ చేసి 100 కోట్ల గ్రాస్ కాదు ఏకంగా 100 కోట్ల షేర్ తెచ్చుకుంటున్నారు. అంటే సింగిల్ భాషలో రిలీజయి 200 కోట్ల గ్రాస్ వసూలు చేస్తున్నారు మహేష్.
ఇది ఏదో ఒకటి, రెండు సినిమాలకి అనుకుంటే పొరపాటే. ఏకంగా వరుసగా 5 సినిమాలతో మహేష్ ఈ రికార్డ్ సాధించాడు. భరత్ అనే నేను సినిమా నుంచి మొదలు పెట్టి మహర్షి, సరిలేరు నీకెవ్వరూ, సర్కారు వారి పాట ఇప్పుడు గుంటూరు కారం సినిమాలతో మహేష్ ఏకంగా ప్రతి సినిమాకి 100 కోట్ల షేర్ కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డ్ సెట్ చేసాడు.
ఇప్పటివరకు ఏ హీరో కూడా సింగిల్ భాషలో రిలీజ్ తో ఈ రికార్డ్ సాధించలేదు. కానీ మహేష్ కేవలం ఒక్క భాషలోనే తన సినిమాని రిలీజ్ చేసి వరుసగా 5 సార్లు 100 కోట్ల షేర్ సాధించాడు. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రీజనల్ సినిమాలతోనే ఈ రికార్డులు సెట్ చేస్తుంటే నెక్స్ట్ రాజమౌళి సినిమా నుంచి పాన్ ఇండియా సినిమాలు చేసి ఇంకెన్ని సరికొత్త రికార్డులు సెట్ చేస్తాడో చూడాలి.
ప్రస్తుతం గుంటూరు కారం(Guntur Kaaram) సినిమా 200 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఇంకా థియేటర్స్ లో నడుస్తుంది. నెక్స్ట్ రాజమౌళితో మహేష్ సినిమా ఈ సంవత్సరం చివర్లో మొదలవుతుందని సమాచారం.
Also Read : NTR Death Anniversary : ఎన్టీఆర్‍కు నివాళులు అర్పించిన జూ. ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్