Mahesh Babu : వెకేషన్ నుంచి తిరిగొచ్చిన మహేష్.. గడ్డంతో లుక్ అదిరిందిగా..
. తాజాగా మహేష్, నమ్రత, సితార, గౌతమ్ అందరూ లండన్ వెకేషన్ ముగించుకొని హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగి బయటకి వస్తున్న విజువల్స్ వైరల్ అవుతున్నాయి.
- By News Desk Published Date - 03:02 PM, Sun - 7 July 24

Mahesh Babu : మహేష్ బాబు రాజమౌళి సినిమా ఎప్పుడు మొదలుపెడతాడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే జరుగుతుంది. కానీ మహేష్ రెగ్యులర్ గా వెకేషన్ కి వెళ్ళినట్టే ఇప్పుడు కూడా వెకేషన్స్ అంటూ తిరుగుతున్నాడు. ఇటీవల తన ఫ్యామిలీతో కలిసి లండన్ వెళ్లిన మహేష్ బాబు తాజాగా హైదరాబాద్ కి తిరిగొచ్చారు.
మహేష్ తనయుడు గౌతమ్ లండన్ లో యాక్టింగ్ కోర్స్ చేస్తున్నట్టు సమాచారం. ఇటీవల నమ్రత లండన్ నుంచి పలు ఫోటోలు షేర్ చేసారు. తాజాగా మహేష్, నమ్రత, సితార, గౌతమ్ అందరూ లండన్ వెకేషన్ ముగించుకొని హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగి బయటకి వస్తున్న విజువల్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో మహేష్ కొత్త లుక్ బాగా వైరల్ అవుతుంది.
ఇప్పటికే బాగా జుట్టు పెంచిన మహేష్, గడ్డం కూడా బాగా పెంచారు. రాజమౌళి సినిమా కోసమే మహేష్ ఇలా జుట్టు, గడ్డం పెంచుతున్నట్టు తెలుస్తుంది. ఈ లుక్ చూసి మహేష్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి వెకేషన్ పూర్తి చేసుకొని మహేష్ వచ్చాడు. ఇప్పటికైనా రాజమౌళి SSMB 29 షూటింగ్ మొదలుపెడతాడా చూడాలి. ఇక రాజమౌళి – మహేష్ బాబు సినిమా మ్యూజిక్ వర్క్స్ జరుగుతున్నట్టు, ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయిపోయినట్టు తెలుస్తుంది.
#MaheshBabu and family back to Hyderabad. pic.twitter.com/eUe54LK2qu
— Gulte (@GulteOfficial) July 7, 2024
Also Read : Kalki 2898 AD : వెయ్యికోట్ల క్లబ్‌లో చేరనున్న కల్కి 2898 ఏడీ