HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Maharashtra Cms Wife Insulted Sreeleela

Sreeleela: శ్రీలీలను అవమానించిన మహారాష్ట్ర సీఎం భార్య

  • Author : Vamsi Chowdary Korata Date : 22-06-2026 - 9:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Maharashtra CM's wife insulted Sreeleela.
Maharashtra CM's wife insulted Sreeleela.

అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల సందర్భంగా ముంబైలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. టాలీవుడ్ యువ హీరోయిన్ శ్రీలీల, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ భార్య, సామాజిక కార్యకర్త అమృతా ఫడణవీస్ ఒకే వేదికపై సందడి చేశారు. అయితే, అక్కడ జరిగిన ఒక చిన్న పరిణామం శ్రీలీల అభిమానులను మరియు నెటిజన్లను ఆగ్రహానికి గురిచేస్తోంది. కార్యక్రమం ముగిసిన అనంతరం అమృతా ఫడణవీస్, ఆమె కుమార్తె మరియు శ్రీలీల కలిసి మీడియా ప్రతినిధులకు గ్రూప్ ఫొటోల కోసం పోజులిచ్చారు. ఆ తర్వాత అక్కడ ఉన్న జర్నలిస్టులు.. అమృతా ఫడణవీస్, ఆమె కుమార్తె ఇద్దరే ఉన్న ఫొటోలు కావాలని అడిగారు. దీనికి స్పందించిన అమృత, పక్కనే నిలబడిన శ్రీలీలకు చేత్తో వేలు చూపిస్తూ పక్కకు వెళ్లాల్సిందిగా కోరారు. ఈ హఠాత్ పరిణామంతో శ్రీలీల ఒక్కసారిగా షాక్‌కు గురవడమే కాకుండా, కాస్త ఇబ్బందిగా, అసౌకర్యంగా ఫీలవుతూ పక్కకు తప్పుకోవడం కెమెరాల్లో రికార్డైంది.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి చర్చిస్తున్నారు. శ్రీలీల అభిమానులు మరియు కొంతమంది నెటిజన్లు అమృతా ఫడణవీస్ ప్రవర్తనను తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఒక పాపులర్ సెలబ్రిటీ అని కూడా చూడకుండా, అంత మంది మీడియా ప్రతినిధుల ముందు వేలు చూపిస్తూ పక్కకు పొమ్మనడం శ్రీలీలను ఘోరంగా అవమానించడమేనంటూ అమృతపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, ఈ వ్యవహారంలో అమృతా ఫడణవీస్‌కు మద్దతుగా కూడా మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. కేవలం మీడియా వారు అడిగిన ఫొటో ఫ్రేమ్ కోసమే ఆమె శ్రీలీలను పక్కకు తప్పుకోమని చాలా సాధారణంగా, గౌరవంగానే కోరారని.. అంతేకానీ ఇందులో ఎలాంటి అవమానకరమైన ఉద్దేశం లేదని సమర్థిస్తున్నారు. సెలబ్రిటీల ఫొటో సెషన్లలో ఇలాంటివన్నీ చాలా సర్వసాధారణంగా జరిగే విషయాలేనని, దీనిని పెద్ద వివాదం చేయాల్సిన అవసరం లేదని విశ్లేషిస్తున్నారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Amruta Fadnavis
  • controversy
  • sreeleela
  • Yoga Day event

Related News

Tilak Varma's argument with umpires... Players clashed after the match ended.

Tilak Varma: అంపైర్లతో తిలక్‌ వర్మ గొడవ.. మ్యాచ్ ముగిశాక కొట్టుకున్న ప్లేయర్స్

డంబుల్లా వేదికగా ఇండియా-ఎ, శ్రీలంక-ఎ జట్ల మధ్య జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్ మ్యాచ్‌ ముగిసినా, ఆ తర్వాత రేగిన వివాదం మాత్రం అంతకంతకూ ముదురుతోంది. సూపర్ ఓవర్‌లో శ్రీలంక జట్టు విజయం సాధించిన అనంతరం.. భారత యువ సంచలనం, కేవలం 15 ఏళ్ల వయసున్న వైభవ్ సూర్యవంశీ మరియు శ్రీలంక ప్లేయర్ విశెన్ హలంబగే మధ్య మైదానంలోనే తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇద్దరూ కొట్టుకునేంత పనిచేశారు. దీనికి సంబంధి

    Latest News

    • Shanmukh Jaswanth: సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న షణ్ముఖ్ జస్వంత్

    • Hyderabad : హైద‌రాబాద్‌లో క్యాబ్ డ్రైవ‌ర్‌కు షాక్‌.. సిగిరెట్ తెమ్మ‌ని..?

    • Women’s T20 World Cup 2026: ఇలా చేస్తేనే మహిళల T20 ప్రపంచకప్‌లో భారత్‌ సెమీస్ కు ..లేదంటే ఇంటికే..!

    • Radha Gayatri: రాధా గాయత్రి మృతి కేసులో ట్విస్ట్

    • Shweta Menon: ‘అమ్మ’ అధ్యక్ష పదవికి నటి శ్వేతా మీనన్ రాజీనామా

    Trending News

      • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd