Madhapur Drug Case: మాదాపూర్ డ్రగ్స్ కేసు లో కొత్త కోణం, లిస్టులో 18 మంది సెలబ్రిటీలు
మాదాపూర్ డ్రగ్స్ కేసు (Madapur drug case) నిందితుల రిమాండ్ రిపోర్ట్ లో (Remand report) కీలక విషయాలు వెల్లడయ్యాయి.
- Author : Balu J
Date : 01-09-2023 - 7:31 IST
Published By : Hashtagu Telugu Desk
Madapur Drug Case: టాలీవుడ్ ను డ్రగ్స్ పట్టిపీడిస్తునే ఉంది. ఇటీవలనే మాదాపూర్ డ్రగ్స్ కేసు వెలుగు చూసిన విషయం తెలిసిందే. అయితే నిందితుల రిమాండ్ రిపోర్ట్ లో (Remand report) కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఈ కేసులో బాలాజీ, వెంకటరత్నా రెడ్డి, మరళిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నలుగురు పెడ్లర్స్ పరారీలో ఉన్నారు. వైజాగ్ చెందిన రామ్ సహా ముగ్గురు నైజీరియన్స్ పరారయ్యారు. రిమాండ్ రిపోర్టులో 18 మంది డ్రగ్స్ కన్జుమర్స్, సినీ పరిశ్రమకు చెందిన పలువురు పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో వినిపించిన వారి పేర్లను పోలీసులు ప్రస్తావించారు. బెంగళూరు నుంచి డ్రగ్స్ తెచ్చి విక్రయిస్తున్న బాలాజీ, వెంకట్ లపై అభియోగాలు మోపారు. డ్రగ్స్ కు నిర్మాత వెంకట్ బానిసైనట్టుగా పోలీసులు పేర్కొన్నారు.
వివాహేతర సంబంధాలు, అమ్మాయిలతో వ్యభిచారం
ఐఆర్‌ఎస్ అధికారిగా నటిస్తూ అమ్మాయిలను కూడా మోసం చేసినట్లు దర్యాప్తు బృందాలు గుర్తించినట్లు సమాచారం. ఏపీకి చెందిన ఓ ఎంపీ పేరు చెప్పి వెంకట్ డబ్బులు వసూలు చేసినట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. మరోవైపు సినిమాల్లో అవకాశాలు వస్తాయనే ఆశతో మహిళలతో వ్యభిచారం చేయిస్తున్నారని పోలీసులు కూడా తమ విచారణలో తేల్చారు. సినీ, రాజకీయ ప్రముఖులతో కలిసి వారాంతపు పార్టీలు నిర్వహిస్తూనే వారిని కొట్టినట్లు విచారణలో తేలింది.
వెంకట్ కాల్ లిస్టులో 18 మంది ప్రముఖుల పేర్లు
రామ్, అమ్మోది చికూడి ముగుముల్, ఇగ్వారే, తామస్ అన్హా, రామ్ చంద్
అర్జున్, రవి ఉప్పలపాటి, సుశాంత్‌రెడ్డి, ఇంద్రతేజా, కల్హర్‌రెడ్డి, సురేష్
రామ్‌కుమార్, ప్రణీత్, సందీప్, సూర్య, స్వేత, కార్తిక్,
నర్సింగ్, ఇటాచి, మహ్మద్ అజామ్, అమ్‌జద్