Abhinaya: సీనియర్ నటి అభినయ పై లుకౌట్ నోటీసులు..
కన్నడ (Kannada) నటి అభినయనను అరెస్ట్ చేసేందుకు బెంగళూరు పోలీసులు సిద్ధమయ్యారు.
- By Maheswara Rao Nadella Published Date - 12:06 PM, Sat - 11 February 23

కన్నడ నటి అభినయనను (Abhinaya) అరెస్ట్ చేసేందుకు బెంగళూరు పోలీసులు సిద్ధమయ్యారు. ఆమె తల్లితో పాటు సోదరుడిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వరకట్న వేధింపుల కేసులో ఈ ముగ్గురిని దోషులుగా తేల్చిన కోర్టు శాండల్‌వుడ్ నటి అభినయకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. వీరిని కోర్టులో హాజరుపరచాల్సి ఉండగా గత నెల రోజులుగా ఈ ముగ్గురు కనిపించకుండా పోయారని పోలీసులు తెలిపారు. దీంతో దోషులపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
కాగా నటి అభినయ (Abhinaya) సోదరుడు శ్రీనివాస్‌కు 1998లో లక్ష్మీదేవి అనే మహిళతో వివాహమైంది. అయితే పెళ్లయిన ఆరు నెలల నుంచే అత్తింటివారు తనను వేధించడం మొదలుపెట్టారని లక్ష్మీదేవి తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసులో ఎన్నో మలుపుల అనంతరం 2012లో వీరిని దోషులుగా తీర్పునిచ్చిన న్యాయస్థానం అభినయకు రెండేళ్లు, ఆమె సోదరుడికి రెండేళ్లు, తల్లికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
Also Read: Telangana Secretariat: తెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా