Lokesh Kanagaraj Prabhas : లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ప్రభాస్.. ఆ సినిమాతో ఎండ్ కార్డ్..
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్(Prabhas) తో సినిమా ఉందని చెప్పి అందరికి సర్‌ప్రైజ్ ఇచ్చాడు.
- Author : News Desk
Date : 08-10-2023 - 10:08 IST
Published By : Hashtagu Telugu Desk
తమిళ్ లో ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న యువ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj). నగరం, ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలతో వరుస సూపర్ హిట్స్ కొట్టి తమిళ్ లో స్టార్ డైరెక్టర్ అయ్యాడు లోకేష్. ఇక తన సినిమాల్లో ఒకదానికి ఒకటి లింక్ పెట్టి లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ సృష్టించాడు. దీంతో లోకేష్ సినిమాలపై తెలుగులోనే కాదు సౌత్ మొత్తం అంచనాలు పెరిగిపోయాయి.
త్వరలో లోకేష్ విజయ్(Vijay) తో లియో(Leo) అనే సినిమాతో రాబోతున్నాడు. ఇక ఇప్పటికే లోకేష్ తన నెక్స్ట్ సినిమాలు కూడా అనౌన్స్ చేశాడు. లియో తర్వాత రజినీకాంత్ తో సినిమా మొదలవ్వనుంది. ఆ తర్వాత విక్రమ్ 2, ఖైదీ 2, సూర్య తో రోలెక్స్, సూర్యతో ఇంకో సినిమా ఉన్నాయి. లోకేష్ ఎప్పట్నుంచో ఓ తెలుగు హీరోతో సినిమా తీద్దామని ప్లాన్ చేస్తున్నాడు. గతంలో రామ్ చరణ్ తో చర్చలు కూడా జరిగాయి.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్(Prabhas) తో సినిమా ఉందని చెప్పి అందరికి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. లియో ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో లోకేష్ మాట్లాడుతూ.. అంతకుముందు చెప్పినట్టే నేను 10 సినిమాలు తీసి డైరెక్షన్ ఆపేస్తాను. లాస్ట్ సినిమా ప్రభాస్ తో ఉండొచ్చు. అది కూడా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ఉంటుంది. ఆ సినిమాతో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కి ఎండ్ పడుతుంది అని తెలిపాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమా రావడానికి చాలా సమయం పడుతుంది.
Also Read : Game Changer: గేమ్ ఛేంజర్ మూవీ అప్డేట్ ఇదే