మాస్ స్టెప్పులతో మైమరిపిస్తున్న ‘లైగర్’
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న ప్యాన్ ఇండియా మూవీ లైగర్ (సాలా క్రాస్ బ్రీడ్). పూరిజగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ యాక్షన్ మూవీ బాక్సింగ్ అభిమానులకు, సాధారణ ప్రేక్షకులకు ఐఫీస్ట్ కానుంది.
- By Balu J Published Date - 08:30 AM, Wed - 27 October 21

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న ప్యాన్ ఇండియా మూవీ లైగర్ (సాలా క్రాస్ బ్రీడ్). పూరిజగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ యాక్షన్ మూవీ బాక్సింగ్ అభిమానులకు, సాధారణ ప్రేక్షకులకు ఐఫీస్ట్ కానుంది.
విజయ్ దేవరకొండ లైగర్ సినిమాలో తన డ్యాన్సులతో అందరినీ ఆశ్చర్యపరిచేందుకు రెడీ అయ్యారు. మాస్ స్టెప్పులతో ఆడియెన్స్‌ను ఆకట్టుకోనున్నారు. ముంబైలో వేసిన ప్రత్యేక సెట్‌లో ఈ మాస్ నంబర్‌కు సంబంధించిన షూటింగ్ మొదలైంది. ఈ మేరకు నిర్మాత ఛార్మీ ఓ పోస్ట్ చేశారు. అందులో విజయ్ దేవరకొండ హ్యాండ్ మాత్రమే కనిపిస్తుండగా.. ఫుల్ మాస్ లుక్కులో ఉండబోతోన్నట్టు హింటిచ్చారు.
‘ముంబైలో లైగర్ సాంగ్ షూటింగ్ ప్రారంభమైంది. విజయ్ దేవరకొండ ఇది వరకు ఎప్పుడూ చేయనట్టుగా డ్యాన్స్ చేసి అందరినీ అబ్బురపరుస్తారు. నన్ను నమ్మండి. మాస్ క్రేజీగా ఉండబోతోంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ పెర్ఫామెన్స్ చూశాక ఈ పోస్ట్ పెట్టకుండా ఉండలేకపోయాను.’ అంటూ ట్వీట్ చేశారు ఛార్మీ.
బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ గా నిర్మిస్తున్నాయి. థాయిలాండ్ స్టంట్ డైరెక్టర్ కెచ్చా యాక్షన్ సీక్వెన్స్‌లను కంపోజ్ చేస్తున్నారు. విష్ణు శర్మ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఈ మూవీ హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మళయాలి భాషల్లో రూపొందిస్తున్నారు. నటీనటులు : విజయ్ దేవరకొండ, అనన్య పాండే, రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, విష్ణురెడ్డి, ఆలి, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను.
సాంకేతిక బృందం:
దర్శకత్వం: పూరి జగన్నాథ్
నిర్మాతలు: పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా
బ్యానర్స్: పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్
కెమెరామెన్: విష్ణు శర్మ
ఆర్ట్ డైరెక్టర్: జానీ షేక్ బాషా
ఎడిటర్: జునైద్ సిద్దిఖీ
స్టంట్ డైరెక్టర్: కెచ్చా
#LIGER song shoot in mumbai , and trust me , @TheDeverakonda is dancing like never before., expect a full massy crazy feast 😉
PS – this tweet is due to the adrenaline rush I m having rite now watching this hottie ‘s energy 😍@PuriConnects @DharmaMovies pic.twitter.com/Mxm10O8KSv
— Charmme Kaur (@Charmmeofficial) October 25, 2021
Related News

Rahul Gandhi Tweet: పోలింగ్ వేళ రాహుల్ గాంధీ ఆసక్తికర ట్వీట్.. “దొరలపై ప్రజలు గెలవబోతున్నారు..”!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi Tweet) ఓటింగ్ కు సంబంధించి ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు.