Vijay Deverakonda & Ananya: ముంబై లోకల్ ట్రైన్ లో విజయ్, అనన్య రచ్చ రచ్చ!
లైగర్ సినిమా షూటింగ్ దాదాపుగా కంప్లీట్ కావడంతో మూవీ టీం ప్రమోషన్స్ పై జోరు పెంచింది.
- By Balu J Updated On - 03:52 PM, Fri - 29 July 22

లైగర్ సినిమా షూటింగ్ దాదాపుగా కంప్లీట్ కావడంతో మూవీ టీం ప్రమోషన్స్ పై జోరు పెంచింది. హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ అనన్య పాండే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. శుక్రవారం విజయ్, అనన్య ఇద్దరూ ముంబై ట్రాఫిక్‌ను అధిగమించడానికి లోకల్ ట్రైన్‌లో ప్రయాణిస్తూ కనిపించారు. అయితే ఈ జంట కంటే ముందే.. జగ్‌జగ్ జీయో నటులు వరుణ్ ధావన్, కియారా అద్వానీ అనిల్ కపూర్ ట్రాఫిక్ కష్టాలను అధిగమించడానికి ముంబై మెట్రో రైడ్ చేశారు.
విజయ్, అనన్య అభిమానులతో సరదాగా గడిపి సినిమా ప్రమోషన్ చేశారు. అయితే ముంబై లోకల్ ట్రైన్‌లో ప్రయాణిస్తున్నప్పుడు ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకుంటూ మునిగిపోయారు. విజయ్ కూడా ప్రయాణంలో అనన్య ఒడిలో నిద్రపోయాడు. అనన్య షేర్ చేసిన ఫొటోలు వైరల్ గా మారాయి. లైగర్ పాన్-ఇండియా చిత్రానికి చిత్రనిర్మాత పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహించారు. కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్, పూరి జగన్నాధ్ పూరి కనెక్ట్స్ నిర్మించిన లైగర్ మూవీ ఆగస్ట్ 25, 2022 న విడుదలకు సిద్ధంగా ఉంది.
#LIGER Movie Promotion With The #VijayDeverakonda & #AnanyaPanday At Local Street In Bandra, Mumbai 😎🔥@TheDeverakonda || @ananyapandayy @PuriConnects #WaatLagaDenge pic.twitter.com/BUGs6D0AM1
— Vijay Deverakonda FC North™ (@VDFCNorthOffl) July 29, 2022
Related News

VIjay Deverakonda: కరణ్ షో ఎఫెక్ట్.. ఛీజ్ అంటూ కామెంట్స్.. ఫీలైన విజయ్ దేవరకొండ!
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విజయ్ దేవరకొండ తాజాగా నటించిన