Salman Khan House Firing Case : సల్మాన్ ఇంటిపై కాల్పులు జరిపిన షూటర్ అరెస్ట్
Bishnoi gang shooter : సల్మాన్ ఖాన్ హత్యకు గతంలోనే సూఖా కుట్రపన్నినట్లుగా అతడిపై ఆరోపణలు ఉన్నాయి. సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పుల ఘటనలో ఆరుగురిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాగా.. అందులో ఈ సూఖా ఒకరు
- By Sudheer Published Date - 03:20 PM, Thu - 17 October 24

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) ఇంటిపై కాల్పుల కేసులో దర్యాప్తు స్పీడ్ అందుకుంది. గ్యాంగ్ స్టార్ లారెన్స్ బిష్ణోయ్ షూటర్లలో ఒకరైన సుఖాను (sukha) నవీ ముంబై పోలీసులు అరెస్టు చేశారని IANS తెలిపింది. హరియాణా పోలీసుల సహకారంతో పానిపట్ సెక్టార్ 29లో అతడిని అధీనంలోకి తీసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 14న సల్మాన్ ఖాన్ (Salman Khan) ఇంటిముందు కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితులు అరెస్ట్ కాగా, తాజాగా హర్యానాలోని పానిపట్ లో లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) గ్యాంగ్ కు చెందిన వ్యక్తి సుఖా ని పోలీసులు అదుపులోకి తీసుకొని , కోర్ట్ లో హాజరు పరచబోతున్నారు.
సల్మాన్ ఖాన్ హత్యకు గతంలోనే సూఖా (sukha) కుట్రపన్నినట్లుగా అతడిపై ఆరోపణలు ఉన్నాయి. సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పుల ఘటనలో ఆరుగురిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాగా.. అందులో ఈ సూఖా ఒకరు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లో అత్యంత చురుకుగా వ్యవహరించే షూటర్లలో ఒకరిగా సూఖాకు పేరుంది. పంజాబ్, రాజస్థాన్, హర్యానాలో లారెన్స్ బిష్ణోయ్‌కి బలమైన నెట్‌వర్క్ ఉంది. అలా హర్యానాలో లారెన్స్ బిష్ణోయ్ కోసం పనిచేసే గ్యాంగ్‌స్టర్ల గ్యాంగ్‌లో ఈ సూఖా కూడా ఉన్నారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఆదేశాల మేరకే సూఖా ముంబైలో సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులకు పాల్పడినట్లు ముంబై పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇదిలా ఉంటె ఇటీవల బాబా సిద్ధిఖీ హత్య తర్వాత పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు అత్యంత కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నారు. ముఖ్యంగా బిష్ణోయ్ వర్గం మెయిన్ టార్గెట్ అయిన సల్మాన్ ఖాన్ నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే సల్మాన్ ఇంటి వద్ద ఫోటోగ్రాఫ్స్, సెల్ఫీలకు అనుమతి నిరాకరించారు. అలాగే సల్మాన్ కూడా ఎవరిని కలవకూడదని నిర్ణయించుకున్నారు.
Read Also : Rashi visited Tirumala : తిరుమలలో పవన్ హీరోయిన్ ను గుర్తుపట్టని భక్తులు