KTR : తెలంగాణలో మ్యూజిక్ యూనివర్సిటీ.. ఇళయరాజా ముందు KTR ప్రకటన..
మ్యూజిక్ స్కూల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా తెలంగాణ మంత్రి KTR హాజరయ్యారు. ఈ సినిమాకు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా(Ilayaraja) సంగీతం వహించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఇళయరాజా కూడా విచ్చేశారు.
- By News Desk Published Date - 07:00 PM, Sun - 7 May 23

మాజీ ఐఏఎస్(IAS) పాపారావు స్వీయ దర్శకత్వంలో మ్యూజిక్ స్కూల్(Music School) అనే సినిమాని తెరకెక్కించారు. మ్యూజిక్ ప్రధానాంశంగా ఈ సినిమాను తెరకెక్కించగా ఇందులో శ్రియా(Shriya) ముఖ్య పాత్రలో నటించింది. ఈ మ్యూజిక్ స్కూల్ సినిమా మే 12న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా తెలంగాణ మంత్రి KTR హాజరయ్యారు. ఈ సినిమాకు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా(Ilayaraja) సంగీతం వహించారు. దీంతో మ్యూజిక్ స్కూల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఇళయరాజా కూడా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో KTR, ఇళయరాజా ఒకే వేదికపై సందడి చేశారు.
ఈ ఈవెంట్ లో KTR మాట్లాడుతూ.. సినిమా దర్శకుడు పాపారావు నాకు మంచి మిత్రుడు. తెలంగాణ ఉద్యమం అప్పుడు ఇక్కడే పనిచేశారు. మనం చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఇలా పెంచాలి, అలా పెంచాలి అని చెపుతాము. పిల్లలకు సంబంధించి చాలా విషయాలు ఈ సినిమాలో ఉన్నాయి అని నిర్మాత చెప్పారు. నాకొడుకుకి 17 సంవత్సరాలు సడన్ గా ఒక రోజు వచ్చి సాంగ్ పాడాను, త్వరలో రిలీజ్ అవుతుంది అని చెప్పాడు. నేను ఆశ్చర్యపోయాను. ఎవరిలో ఏ ట్యాలెంట్ ఉందో మనకు తెలీదు. అది బయటకు వచ్చినప్పుడు సపోర్ట్ చేయాలి. ఇళయరాజా గారు ఒప్పుకుంటే మన తెలంగాణలో మ్యూజిక్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాను అని అన్నారు.
ఇక ఇదే ఈవెంట్ లో ఇళయరాజా మాట్లాడుతూ.. మ్యూజిక్ ఉంటే వైలెన్స్ ఉండదు, చీటింగ్ ఉండదు. మ్యూజిక్ ఉంటే లక్ష్మీ, సరస్వతి కూడా ఉంటాయి. KTR చెప్పినట్టు ఇక్కడ మ్యూజిక్ యూనివర్సిటీ వస్తే మరో 200 మంది ఇళయరాజాలు తయారు అవుతారు. దేశం మొత్తం కూడా ఇక్కడ పర్ఫార్మెన్స్ ఇస్తారు అని అన్నారు. దీంతో తెలంగాణలో త్వరలో మ్యూజిక్ యూనివర్సిటీ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. సంగీత ప్రియులు ఈ ప్రకటనతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : ShahRukh Khan Jawan : ‘జవాన్’లో షారుక్ మొహంపై కట్టు.. ఎందుకు ఉందంటే ?