Krithi Shetty : బేబమ్మ మీద అంత పగబట్టింది ఎవరు..?
సక్సెస్ ఫెయిల్యూర్స్ రెండిటినీ బ్యాలెన్స్ చేయాలని చూస్తున్న కృతి శెట్టి రీసెంట్ ఇంటర్వ్యూలో తన ఫెయిల్యూర్స్ చూసి కొందరు సంతోషపడుతున్నారని
- By Ramesh Published Date - 06:16 PM, Thu - 29 August 24

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి (Krithi Shetty) ఆ సినిమాతో బేబమ్మగా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. బుచ్చి బాబు డైరెక్షన్ లో తెరకెక్కిన ఉప్పెన సినిమాతో తొలి సినిమాతోనే 100 కోట్లు అందుకుంది కృతి శెట్టి. ఐతే ఆ సినిమాతో వచ్చిన క్రేజ్ ను కాపాడుకోవడంలో అమ్మడు విఫలమైంది. కెరీర్ లో 10 సినిమాల దాకా చేసిన కృతి శెట్టి ప్రస్తుతం వెనకపడింది.
లాస్ట్ ఇయర్ కస్టడీ తో హిట్ అందుకుంటుందని అనుకోగా అది కాస్త మిస్ ఫైర్ అయ్యింది. ఈమధ్యనే వచ్చిన శర్వానంద్ (Sharwanand) మనమే సినిమాతో అమ్మడు జస్ట్ ఓకే అనిపించుకుంది. ఐతే సక్సెస్ ఫెయిల్యూర్స్ రెండిటినీ బ్యాలెన్స్ చేయాలని చూస్తున్న కృతి శెట్టి రీసెంట్ ఇంటర్వ్యూలో తన ఫెయిల్యూర్స్ చూసి కొందరు సంతోషపడుతున్నారని అన్నది.
కృతి శెట్టి కామెంట్స్ ఎవరి గురించి అన్నది తెలియదు కానీ కథానాయికల్లో గట్టి పోటీ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఐతే సక్సెస్ ని ఎంజాయ్ చేస్తారు కానీ ఇలా ఒక హీరోయిన్ కి ఫ్లాప్ వస్తే కూడా మిగతా వారు సంతోషపడతారా అన్నది కృతి శెట్టి చెబితేనే అర్ధమైంది.
ఐతే ఇక మీదట కెరీర్ మీద మరింత ఫోకస్ చేస్తానంటున్న బేబమ్మ (Bebamma) హిట్లు, ఫ్లాపులను సమానంగా చూస్తా అంటుంది. అంతేకాదు ఫెయిల్యూర్స్ నుంచి తగిన పాఠాలు నేర్చుకుంటున్నానని చెబుతుంది. ప్రస్తుతం తెలుగులో ఏ సినిమా లేదు కానీ తమిళంలో రెండు సినిమాలు చేస్తుంది. మలయాళంలో ఒక సినిమా ఛాన్స్ అందుకుంది. అందం అభినయం రెండు ఉన్నా సరే కృతి శెట్టికి కాలం కలిసి రావట్లేదు. అమ్మడి ఖాతాలో మరో సూపర్ హిట్ పడితే కానీ కెరీర్ ఊపందుకునే అవకాశం లేదనిపిస్తుంది. మరి ఆ లక్కీ ఛాన్స్ ఎవరు ఇస్తారన్నది చూడాలి.