Krishnam Raju Funeral: కృష్ణంరాజుకు తలకొరివి పెట్టేది ప్రభాస్ కాదట..!!
ప్రముఖ సీనియర్ నటుడు, రాజకీయనాయకుడు కృష్ణంరాజుకు మరణంతో టాలీవుడ్ దిగ్భ్రాంతపోయింది.
- Author : hashtagu
Date : 12-09-2022 - 10:38 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రముఖ సీనియర్ నటుడు, రాజకీయనాయకుడు కృష్ణంరాజుకు మరణంతో టాలీవుడ్ దిగ్భ్రాంతపోయింది. అభిమానులు, ప్రముఖులంతా ఆయనకు నివాళులర్పిస్తున్నారు. కాసేపట్లో కృష్ణంరాజు అంత్యక్రియలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తుంది. మధ్యాహ్నం 1గంటలకు మొయినాబాద్ దగ్గరలోని కనకమామిడి ఫాంహౌస్ లో కృష్ణంరాజు అంత్యక్రియలు జరగనున్నాయి.
కృష్ణంరాజు అంత్యక్రియలను హీరో ప్రభాస్ సోదరుడు ప్రభోద్ చేతుల మీదుగా జరగనున్నాయి. అంత్యక్రియలకు సంబంధించి ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. కృష్ణంరాజు భౌతికకాయం ప్రస్తుతం ఆయన నివాసంలో ఉంది. సినీ, రాజకీయ ప్రముఖులు రెబల్ స్టార్ కడసారి చూపుకోసం తరలివస్తున్నారు. అనారోగ్య సమస్యలతో కొంత కాలంగా బాధపడుతున్న కృష్ణంరాజు ఆదివారం తెల్లవారుజామున 3గంటలకు ఆసుపత్రిలో మరణించిన సంగతి తెలిసిందే.