Krishnam Raju : కృష్ణంరాజు సినిమాల్లోకి ఎలా వచ్చారు..? అంతకుముందు ఏం చేసేవారు..?
‘బావమరదళ్లు’ చిత్రం నిర్మించిన పద్మనాభరావు ప్రోత్సాహంతో.. 1963లో కృష్ణంరాజు సినిమా వైపు అడుగులు వేశారు.
- Author : News Desk
Date : 05-11-2023 - 8:39 IST
Published By : Hashtagu Telugu Desk
Krishnam Raju : టాలీవుడ్ రెబల్ స్టార్(Rebel Star) కృష్ణంరాజు.. 1966లో ‘‘చిలకా గోరింకా’ సినిమాలో హీరోగా నటించి నటుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు ‘ప్రత్యగాత్మ’ తెరకెక్కించారు. ఈ చిత్రానికి నిర్మాత కూడా ఈయనే. ఈ చిత్రంలో కృష్ణంరాజుని ఎలా ఎంపిక చేసుకున్నారు. అంతకుముందు కృష్ణంరాజు ఏం చేసేవారు అనే విషయాలు తెలుసా?
చదువు పూర్తి చేసిన కృష్ణంరాజు.. ఆయన పినతండ్రి ప్రారంభించిన ‘ఆంధ్రరత్న’ దినపత్రిక, సినీ సౌండ్ స్టూడియో నిర్వహణ భాద్యతలు చూసుకునే వారు. ‘బావమరదళ్లు’ చిత్రం నిర్మించిన పద్మనాభరావు ప్రోత్సాహంతో.. 1963లో కృష్ణంరాజు సినిమా వైపు అడుగులు వేశారు. మద్రాసు చేరుకున్న కృష్ణంరాజు, ప్రత్యగాత్మని కలుసుకున్నారు. కృష్ణంరాజుకు స్క్రీన్ టెస్ట్ చేసిన ప్రత్యగాత్మ.. తాను తీయబోయే కొత్త సినిమాలో వకాశం ఇస్తానని మాటిచ్చారు.
అయితే ఈలోపు నటనలో మెళుకువలు నేర్చుకుంటే మంచిదని, అందుకోసం నాటకాల్లో నటిస్తూ ఉండమని.. ప్రత్యగాత్మ, కృష్ణంరాజుకి సలహా ఇచ్చారు. దీంతో కృష్ణంరాజు ‘పరివర్తన’, ‘నాగమల్లి’ వంటి నాటకాల్లో నటించడమే కాకుండా, పలు సినిమా షూటింగ్ లకు కూడా హాజరవుతూ నటనలో మెళకువలు గ్రహిస్తూ వచ్చారు. ఆ తరువాత 1965 ఆగష్టు 6న ‘చిలకా గోరింకా’ సినిమా షూటింగ్ మొదలయింది. అలా కృష్ణంరాజు వెండితెరకు పరిచయమయ్యారు.
ఈ సినిమాలో కృష్ణంరాజు సరసన సీనియర్ నటి కృష్ణకుమారి నటించారు. అయితే ఈ సినిమా సమయానికి కృష్ణకుమారి ఆల్రెడీ 100 సినిమాలకు పైగా నటించారు. గతంలో ప్రత్యగాత్మ దర్శకత్వం వహించిన రెండు హిట్ మూవీస్ లో కృష్ణకుమారి నటించి ఉండడంతో.. కొత్త నటుడైన కృష్ణరాజు సరసన నటించడానికి ఒకే చెప్పారట. ఈ సినిమాతో కృష్ణంరాజు మాత్రమే కాదు, హాస్యనటి రమాప్రభ కూడా వెండితెరకు పరిచయమయ్యారు.
Also Read : Manthan : ఈ సినిమాకి 5 లక్షలమంది నిర్మాతలు తెలుసా..?