Devara: ఎన్టీఆర్ దేవర కోసం ఆ డేంజరస్ ఫార్ములా అప్లై చేస్తున్న కొరటాల శివ!
- By Sailaja Reddy Published Date - 07:37 PM, Thu - 14 March 24
టాలీవుడ్ పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం దేవర. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.. అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలను నెలకొన్నాయి. దానికి తోడు ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేసాయి. ఇకపోతే తెలుగులో మొదటగా పాన్ ఇండియా సినిమా పెట్టింది రాజమౌళి అన్న విషయం మనందరికీ తెలిసిందే.
అదే విషయాన్ని కంటిన్యూ చేస్తూ దర్శకుడు నిర్మాతలు ప్రతి ఒక్కరు కూడా పాన్ ఇండియాలో సినిమాల వైపు మొగ్గు చూపుతున్నారు. కొరటాల శివ సైతం ఇదే చేస్తున్నారు. దేవర కోసం ఎంచక్కా బాహుబలి ఫార్ములానే దించేస్తున్నారు ఈయన. తన స్టైల్లో దేవర ప్రపంచాన్ని చూపించబోతున్నారు. మరి కొరటాల ఏ విషయంలో జక్కన్నను ఫాలో అవుతున్నారు అన్న విషయానికి వస్తే.. దేవర కోసం కొరటాల శివ కూడా బాహుబలి రూట్లోనే వెళ్తున్నారు. ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. పెరిగిన బడ్జెట్ను రికవరీ చేసుకోడానికి ఇదో మంచి మార్గమే. అక్టోబర్ 10న రిలీజ్ డేట్ ఉండటంతో దాన్ని దృష్టిలో పెట్టుకుని దేవర షూటింగ్ వేగంగా చేస్తున్నారు మూవీ మేకర్స్.
ఇందులో ఎన్టీఆర్ తండ్రీ కొడుకులుగా నటిస్తున్నారు. బాహుబలిలో అమరేంద్ర, మహేంద్ర బాహుబలి పాత్రల్ని రాజమౌళి క్రియేట్ చేసినట్లుగానే దేవరలోనూ రెండు పాత్రలను సమాంతరంగా చూపించబోతున్నారు కొరటాల శివ.బాహుబలి ది బిగినింగ్ ఫస్టాఫ్లో కొడుకు పాత్ర ఉంటే సెకండాఫ్ అంతా తండ్రి పాత్ర ఉంటుంది. అలాగే కంక్లూజన్ ఫస్టాఫ్లో తండ్రి పాత్ర ముగింపు సెకండాఫ్లో కొడుకు పగ తీర్చుకోవడంతో కథ ముగుస్తుంది. దేవరలోనూ ఇదే ఫార్మాట్ కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. దేవర 1లో కొడుకు సీక్వెల్లో తండ్రి పాత్రలు హైలైట్ కానున్నట్లు తెలుస్తోంది. తండ్రీ కొడుకుల పాత్రలన్ని ఒకదాన్ని మించి మరోటి ప్లాన్ చేస్తున్నారు కొరటాల. ఎలివేషన్స్ విషయంలో ఎక్కడా తగ్గేదే లే అంటున్నారు.
Related News
Ashu Reddy : నా బాడీ సూపర్ డీలక్స్ అంటున్న అషు రెడ్డి..!
Ashu Reddy జూనియర్ సమంతగా గుర్తింపు తెచ్చుకున్న అషు రెడ్డి బిగ్ బాస్ తో పాపులారిటీ తెచ్చుకుంది. కొన్నాళ్లు బుల్లితెర మీద షోలు చేసిన అమ్మడు ఆర్జీవితో కలిసి చేసిన ఇంటర్వ్యూ ఆమెను వైరల్ అయ్యేలా