Konda Surekha : మంత్రి కొండా సురేఖ కు కోర్ట్ భారీ షాక్..
Nampally court : ఈ కేసులో కొండా సురేఖకు నోటీసులు జారీ చేసినట్లు కోర్టు పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 23వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.
- By Sudheer Published Date - 03:41 PM, Thu - 10 October 24

మంత్రి కొండా సురేఖ (Konda Surekha ) కు నాంపల్లి కోర్ట్ షాక్ ఇచ్చింది. రీసెంట్ గా సురేఖ .. నాగార్జున (Nagarjuna) ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై నాగార్జున..సురేఖ పై పరువు నష్టం దావా వేశారు. ఈ క్రమంలో కోర్ట్ ఈరోజు దీనిపై మరోసారి విచారణ జరిపి… ఈ కేసులో కొండా సురేఖకు నోటీసులు (Court notice In defamation case) జారీ చేసినట్లు కోర్టు పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 23వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.
అటు కేటీఆర్ (KTR) సైతం కొండా సురేఖపై పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. కొండా సురేఖపై కేటీఆర్ తరపు న్యాయవాది ఉమా మహేశ్వర్ రావు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన ప్రతిష్టను దెబ్బతీసేలా కొండా సురేఖ వ్యాఖ్యానించారని కేటీఆర్ తన పిటిషన్‌లో పేర్కొంటూ.. బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజు శ్రవణ్‌లను కేటీఆర్ సాక్షులుగా పేర్కొన్నారు.
అంతకు ముందు కేటీఆర్ సురేఖ కు లీగల్ నోటీసులు కూడా పంపించడం జరిగింది. తనకు సంబంధం లేని ఫోన్ ట్యాపింగ్‌పై అసత్యాలు మాట్లాడరని , ఫోన్ ట్యాపింగ్‌తో పాటు నాగచైతన్య, సమంత విడిపోవడానికి ప్రధాన కారణం కేటీఆర్ అంటూ దుర్వేశపూర్వక వ్యాఖ్యలు చేశారని, కేవలం తన గౌరవానికి, ఇమేజ్‌కి భంగం కలిగించాలనే లక్ష్యంతోనే అడ్డగోలు వ్యాఖ్యలు చేశారని కేటీఆర్ లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు. కేవలం రాజకీయ కక్షతో, రాజకీయ ప్రయోజనాల కోసం తన పేరును కొండా సురేఖ వాడుకుంటున్నారని.. మహిళ అయిఉండి సాటి మహిళ పేరును, సినిమా నటుల పేరును వాడుకొని వారి వ్యక్తిత్వ హననానికి కూడా పాల్పడడం దురదృష్టకరమన్నారు.
Read Also : Health Secrets: మైదా మంచిదని అతిగా తింటున్నారా? మీకు ఈ విషయం తెలియాలి..!