Vijay Rashmika Relation: రష్మిక ‘రిలేషన్’ పై విజయ్ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ హిట్ ఫెయిర్ లో రష్మిక, విజయ దేవరకొండ జంట ఒకటి.
- Author : Balu J
Date : 29-07-2022 - 8:30 IST
Published By : Hashtagu Telugu Desk
టాలీవుడ్ హిట్ ఫెయిర్ లో రష్మిక, విజయ దేవరకొండ జంట ఒకటి. గీతగోవింద మూవీతో ఈ జంట హిట్ పెయిర్ అనిపించుకుంది. వెండితెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ చాలా క్లోజ్ మూవ్ అవుతుంది ఈ జంట. ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా పార్టీలకు, టూర్స్ కు వెళ్తుంటారు. అయితే జంటపై చాలా కాలంగా రూమర్స్ వచ్చాయి. కాఫీ విత్ కరణ్ లో రష్మికతో రిలేషన్ గురించి క్లారిటీ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. “ఆమె డార్లింగ్, నేను ఆమెను నిజంగా ఇష్టపడుతున్నాను” అంటూ సమాధానమిచ్చాడు. కరణ్ జోహార్ వారి సంబంధం గురించి విజయ్‌ని అడిగినప్పుడు ఈ విధంగా రియాక్ట్ అయ్యాడు. “నా జీవితంలో ప్రారంభ దశలో మేం రెండు సినిమాలు చేశాం. ఆమె నా డార్లింగ్, అందుకే ఆమెను నిజంగా ఇష్టపడుతున్నాను. మంచి స్నేహితులం. సినిమాల వల్ల మా ఇద్దరి బంధం మరింత ఏర్పడుతుంది.” అంటూ సమాధానమిచ్చాడు.
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. లైగర్ పాన్-ఇండియా చిత్రానికి చిత్రనిర్మాత పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహించారు. కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్, పూరి జగన్నాధ్ పూరి కనెక్ట్స్ నిర్మించిన లైగర్ ఆగస్ట్ 25, 2022 న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇక రష్మిక అమితాబ్ తో కలిసి నటిస్తున్న ఓ సినిమా షూటింగ్ దశలో ఉంది. దీంతో పాటు మరో నాలుగు బాలీవుడ్ సినిమాలు లైన్లో ఉన్నాయి.