Kiran Abbavaram: నా సినిమా నేను చూడలేక మధ్యలోనే బయటికి వచ్చాను : కిరణ్ అబ్బవరం
- Author : Sailaja Reddy
Date : 08-04-2024 - 6:45 IST
Published By : Hashtagu Telugu Desk
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి మనందరికీ తెలిసిందే. రాజావారు రాణి గారు సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం ఈ సినిమాతో భారీగా పాపులారిటీని సంపాదించుకుంటున్నారు. తర్వాత వచ్చిన ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరింత చేరువ అవ్వడంతో పాటు హీరోగా భారీగా క్రేజ్ ని ఏర్పరుచుకున్నారు కిరణ్ అబ్బవరం. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో వరుసగా ఆఫర్స్ అందుకున్నాడు కిరణ్. అయితే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయాడు.
We’re now on WhatsApp. Click to Join
అయినా కూడా వెనకాడుగు వేయకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే ఈ కుర్ర హీరో పెళ్ళికి రెడీ అయ్యాడు. ఇటీవలే కిరణ్ అబ్బవరం ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే కిరణ్ ఒక ఇంటర్వ్యూలో తన సినిమా గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సందర్భంగా మాట్లాడుతూ.. ఒకసారి థియేటర్లో సినిమా ప్రదర్శితం అవుతుంటే థియేటర్ నుంచి మధ్యలోనే బయటకి వచ్చేశాను. సినిమా ఇంటర్వెల్‌కి వచ్చేసరికి పెద్దగా బాలేదని నాకు అర్థమైంది. ఇదే విషయం పక్కనున్న టీమ్‌కి చెప్పేసి నేను బయటికి వచ్చేశాను. కానీ హీరో అయినే మీరే ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ వాళ్లు చెప్పారు.
Also Read: Kannappa : మంచు విష్ణు ‘కన్నప్ప’లో మరో స్టార్.. బాలీవుడ్ నుంచి ఆ హీరో..
అయినా నేను హీరో అయింత మాత్రాన చెత్త సినిమాను మంచి చిత్రమని చెప్పలేం కదా అంటూ కిరణ్ అబ్బవరం చెప్పారు. అయితే అది ఏ సినిమా అనే విషయాన్ని మాత్రం ఆయన చెప్పలేదు. ప్రస్తుతం కిరణ్ రొమాంటిక్ డ్రామా దిల్ రుబా మూవీలో నటిస్తున్నాడు. ఇందులో రుక్సార్ ధిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తుంది. 2019లో రాజా వారు రాణి గారు సినిమాతో వెండితెరకి పరిచయమయ్యాడు కిరణ్ అబ్బవరం. ఆ తర్వాత ఎస్‌ఆర్ కళ్యాణ మండపం సినిమాతో విజయాన్ని అందుకున్నాడు. అలా కెరీర్‌లో పడుతూ లేస్తూ కొనసాగుతున్నాడు. ఇక కిరణ్ తీసిన చివరి రెండు చిత్రాలు మీటర్, రూల్స్ రంజన్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.
Also Read: Vettaiyan: అక్టోబర్ లో ఆ ఇద్దరు హీరోలకు పోటీ ఇవ్వబోతున్న రజనీకాంత్?