Kim Kardashian-Crypto Hype : క్రిప్టో స్కామ్ లో అందాల భామ కిమ్ కర్దాషియన్
Kim Kardashian-Crypto Hype : హాలీవుడ్ అందాల తార కిమ్ కర్దాషియన్ ఓ కేసులో కోర్టు మెట్లు ఎక్కారు..Ethereum Max అనే ఆల్ట్‌కాయిన్‌లను ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రమోట్ చేయడమే ఈ కేసుకు కారణం..
- Author : Pasha
Date : 07-06-2023 - 11:28 IST
Published By : Hashtagu Telugu Desk
Kim Kardashian-Crypto Hype : హాలీవుడ్ అందాల తార కిమ్ కర్దాషియన్ ఓ కేసులో కోర్టు మెట్లు ఎక్కారు..
Ethereum Max అనే ఆల్ట్‌కాయిన్‌లను ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రమోట్ చేయడమే ఈ కేసుకు కారణం..
ఈ ఆల్ట్‌కాయిన్‌లను కొనాలని ప్రజలకు పిలుపునిస్తూ కర్దాషియన్ 2021 జూన్ లో ఇన్‌స్టాగ్రామ్ లో ఒక స్టోరీని పోస్ట్ చేశారు.
ఆమె పిలుపునకు స్పందనగా ఎంతోమంది ఆమె అభిమానులు Ethereum Max ఆల్ట్‌కాయిన్‌లను ఎగబడి కొన్నారు..
ఇన్‌స్టాగ్రామ్ లో ఈ ప్రమోషనల్ పోస్ట్ పెట్టడానికి కిమ్ కర్దాషియన్ రూ.2 కోట్లు తీసుకున్నారనే టాక్ నడుస్తోంది.
ఎగబడి కొన్న వాళ్ళు ఆగమాగం
కిమ్ కర్దాషియన్ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ను చూసి నమ్మి Ethereum Max ఆల్ట్‌కాయిన్‌లను ఎగబడి కొన్న వాళ్ళ పరిస్థితి ఆగమాగం అయింది. ఆమె పోస్ట్ చేసిన 16 నెలల తర్వాత Ethereum Max ఆల్ట్‌కాయిన్ విలువ 95.3 శాతం పడిపోయింది. అంటే కర్దాషియాన్ ఆ టోకెన్‌ను ప్రమోట్ చేసిన తర్వాత ఎవరైనా 100 డాలర్లు పెట్టుబడి పెట్టి ఉంటే.. ఈరోజు దాని విలువ 5 డాలర్లు మాత్రమే. ఇలా లాస్ అయిన ఇన్వెస్టర్లే ఇప్పుడు కిమ్ కర్దాషియన్ పై కేసు పెట్టారు.
Also read : Cryptocurrency: బ్యాంగ్ బ్యాంగ్.. క్రిప్టోకరెన్సీని కొల్లగొట్టారు
కిమ్ కర్దాషియన్ పోస్ట్ పై జడ్జి ఏమన్నారో తెలుసా ?
పెట్టుబడిదారులను మోసగించే ఉద్దేశంతో, తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో(Kim Kardashian-Crypto Hype) తాను ఇన్ స్టాగ్రామ్ లో ఆ పోస్ట్ పెట్టలేదని కిమ్ కర్దాషియన్ తరఫు న్యాయవాది చేసిన వాదనలతో లాస్ ఏంజిల్స్‌లోని డిస్ట్రిక్ట్ జడ్జి మైఖేల్ ఫిట్జ్‌గెరాల్డ్ ఏకీభవించలేదు. కొన్ని నైట్ క్లబ్‌లలో టేబుల్స్ ను రిజర్వ్ చేసుకునేందుకు EthereumMax టోకెన్‌లను అంగీకరిస్తారని కిమ్ కర్దాషియన్ పెట్టిన పోస్ట్ ప్రజలపై చూపిన ప్రభావాన్ని తోసిపుచ్చలేమని జడ్జి పేర్కొన్నారు. ఆమె పెట్టిన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ తప్పుదోవ పట్టించేలా ఉందనే అభియోగాలను నిరాకరించలేమని తెలిపారు.
Also read : Crypto King: ప్రజలను నిండా ముంచి ప్రైవేట్ జెట్ కొన్న క్రిప్టో కింగ్.. బయటపడిన కిడ్నాప్ డ్రామా?
ఏమిటీ Ethereum Max ఆల్ట్‌కాయిన్ ?
వాస్తవానికి 2021 మేలో Ethereum Max ఆల్ట్‌కాయిన్ అమెరికాలో లాంచ్ అయింది. ఇది లాంచ్ అయినప్పటి నుంచి వివాదాల్లోనే ఉంది. Ethereum Max ఆల్ట్‌కాయిన్ కు ప్రసిద్ధ Ethereum క్రిప్టోకరెన్సీతో ఏ సంబంధమూ లేదు. Ethereum Max అనేది అమ్మకాలు, లావాదేవీలను రికార్డ్ చేయడానికి Ethereum యొక్క బ్లాక్‌చెయిన్ లెడ్జర్‌ను ఉపయోగించే ఆల్ట్‌కాయిన్ మాత్రమే.