Kiara And Sidharth: బాలీవుడ్ లో పెళ్లి భాజాలు.. కియారాతో సిద్దార్థ్ పెళ్లి ఫిక్స్!
బాలీవుడ్ (Bollywood) లో మరో జంట పెళ్లి చేసుకోబోతోంది.
- Author : Balu J
Date : 31-12-2022 - 2:03 IST
Published By : Hashtagu Telugu Desk
బాలీవుడ్ (Bollywood)లో మరో జంట పెళ్లి చేసుకోబోతోంది. బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ (Kiara Advani), హీరో సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth) ఫిబ్రవరి 6న వివాహం (Marriage) చేసుకోబోతున్నారు. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో పెళ్లి జరగనుందని సమాచారం. ఫిబ్రవరి 4, 5 తేదీల్లో వివాహానికి ముందు జరిగే కార్యక్రమాలు జరుగుతాయి. అతిథులు, కుటుంబ సభ్యులు సంప్రదాయ, మెహందీ, హల్దీ మరియు సంగీత వేడుకలను జరుపుకుంటారు. వివాహం 6వ తేదీన ప్యాలెస్ హోటల్‌లో జరగనుంది. భారీ భద్రతతో అంగరంగ వైభవంగా జరగనుంది అని మీడియా చెబుతోంది.
కరణ్ జోహార్ తన షోలో కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా వారి సంబంధం గురించి పలు ప్రశ్నలు అడిగారు. కరణ్ జోహార్ కియారాను అడిగినప్పుడు “సిద్ధార్థ్‌తో రిలేషన్ లో ఉన్నారా.. అని అడిగినప్పుడు “నేను తిరస్కరించడం లేదా అంగీకరించడం లేదు.” అని చెప్పింది. కానీ ఈ జంట పలు పబ్లిక్ ప్లేసుల్లో చెట్టాపట్టాల్ వేసుకొని తిరిగారు. రిలేషన్ (Realtion)పై రూమర్స్ వస్తున్న నేపథ్యంలో తమ బంధాన్ని బయటపెట్టారు.
గతంలోనే కియారా (Kiara Advani) సిద్దార్థ్ పెళ్లి గురించి వార్తలు ప్రచారంలోకి వచ్చినా ఆ వార్తలు నిజం కాలేదు. ఈసారి మాత్రం నిజంగానే పెళ్లి జరగనుందని తెలుస్తోంది. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీలో హీరోయిన్ గా కూడా కియారా అద్వానీ పేరు వినిపించింది. ఈ నేపథ్యంలో కియారా (Kiara Advani) అద్వానీ నటిస్తారో లేదో స్పష్టత వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.
Also Read: Actress Poorna: నటి పూర్ణకు మదర్ ప్రమోషన్