Double Ismart : డబుల్ ఇస్మార్ట్ సాంగ్‌లో ‘కేసీఆర్ డైలాగ్ ‘..ఇక వైరల్ చేయకుండా ఉంటారా..!!
కేసీఆర్ ఓ ప్రెస్‍మీట్‍లో అన్న ఈ మాట ఆ తర్వాత సోషల్ మీడియా లో పాపులర్ అయిన విషయం తెలిసిందే
- By Sudheer Published Date - 08:17 PM, Tue - 16 July 24

డబుల్ ఇస్మార్ట్ (Double Ismart) నుండి కొద్దీ సేపటి క్రితం ‘మార్ ముంత చోడ్ చింత’ (Maar Muntha Chod ) సాంగ్ వచ్చింది..వచ్చి రావడమే సోషల్ మీడియా ను షేక్ చేస్తుంది..దీనికి కారణం ఆ సాంగ్ లో మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫేమస్ డైలాగ్ ఉండడమే.
రామ్ – పూరి కలయికలో 2019 లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ (Ismart Shankar) కు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ (Double Ismart) రాబోతుంది. ప్రస్తుతం షూటింగ్ అంత పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రామ్ సరసన కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నాడు. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మితో కలిసి పూరి జగన్నాధ్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ మూవీ ఫై అంచనాలు తారాస్థాయిలో ఉండడంతో..పూరి ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కిస్తున్నాడు. ఈ మధ్యనే ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసి మ్యూజిక్ ప్రియులను ఆకట్టుకున్న మేకర్స్..ఇప్పుడు రెండో సింగిల్ ‘మార్ ముంత చోడ్ చింత’ (Maar Muntha Chod ) అంటూ సాగే సాంగ్ ను విడుదల చేసారు. ఈ సాంగ్ ఆలా విడుదల అయ్యిందో లేదో..సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. దీనికి కారణం మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఫెమస్ డైలాగ్ ‘ఏం చేద్దాం అంటవ్ మరి’ (Yem Cheddam Antav Mari) ఉండడమే. గతంలో కేసీఆర్ ఓ ప్రెస్‍మీట్‍లో అన్న ఈ మాట ఆ తర్వాత సోషల్ మీడియా లో పాపులర్ అయిన విషయం తెలిసిందే. దీన్ని ఫేమస్ మీమ్‌గా నెటిజన్లు వాడుతుంటారు. ఇప్పుడు పూరి తన సాంగ్ మధ్య లో ఆ డైలాగ్ పెట్టి ప్రేక్షకులకు కిక్ ఇచ్చాడు. ఇక ఈ సాంగ్ ను రాహుల్ సిప్లిగంజ్, కీర్తన శర్మ ఆలపించగా..మణిశర్మ మ్యూజిక్ అందించారు.
Read Also : Kodali Nani : కొడాలి నానికి భారీ షాక్..పార్టీ ఆఫీస్ స్వాధీనం