Kodali Nani : కొడాలి నానికి భారీ షాక్..పార్టీ ఆఫీస్ స్వాధీనం
గుడివాడ నడిబొడ్డులో ఇన్నాళ్ల అరాచకానికి అడ్డాగా వైసీపీ కార్యాలయం నిలిచిందని ఆరోపించారు. ఇక్కడకు రావాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి ఉండేదన్నారు
- By Sudheer Published Date - 07:57 PM, Tue - 16 July 24

ఏపీలో వైసీపీ నేతలకు (YCP Leaders) వరుస షాకులు నిద్ర కూడా పట్టనివ్వడం లేదు. గడిచిన ఐదేళ్లు టీడీపీ (TDP) నేతలకు చుక్కలు చూపిస్తే…ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ అంతకు మించి చూపిస్తుంది. వైసీపీ నేతలు కబ్జా చేసిన భూములు , అక్రమంగా కట్టుకున్న నిర్మాణాలు , దోచుకున్న ప్రజల సొమ్ము ఇలా అన్నింటిని వడ్డీ తో సహా లాగేసుకుంటుంది. జగన్ దగ్గరి నుండి మొదలుపెడితే గల్లీ లో ఉన్న నేతల వరకు ఎవర్ని వదిలిపెట్టడం లేదు. తాజాగా గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని (EX MLA Kodali Nani ) కి భారీ షాక్ తగిలింది.
We’re now on WhatsApp. Click to Join.
గత కొంతకాలంగా కొడాలి నాని ఆధ్వర్యంలో ఉన్న శరత్ థియేటర్ (Sarath Theater)ను యాజమాన్యం స్వాధీనం చేసుకుంది. గత కొంతకాలంగా ఈ థియేటర్‌లోనే నాని తన పార్టీ వ్యవహారాలు నడిపిస్తూ..ఆఫీస్ కొనసాగిస్తూ వచ్చాడు. ఈ థియేటర్‌ను నాని ఆక్రమించుకున్నారని ఆరోపణ కూడా అప్పట్లో వెలువడ్డాయి. అధికారం వారి చేతిలో ఉండడం తో శరత్ థియేటర్ యాజమాన్యం ఏమి అనలేకపోయింది. కానీ ఇప్పుడు అధికారంలోకి కూటమి ప్రభుత్వం రావడంతో అంత బయటకు వస్తూ..వైసీపీ నేతలపై పిర్యాదులు చేస్తూ తమ ఆస్తులను దక్కించుకుంటున్నారు. ఇప్పుడు శరత్ థియేటర్ యాజమాన్యం కూడా అలాగే చేసింది. టీడీపీ నేతల సహకారంతో శరత్ టాకీస్‌ను స్వాధీనం చేసుకుంది. అయితే.. ఈ శరత్ టాకీస్‌లో టీ-పార్టీకి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము (Venigandla Ramu) హాజరు కావడం గుడివాడలో హాట్ టాపిక్ గా మారింది. శరత్ టాకీస్ యాజమాన్యంలో ఒకరైన మాజీ మున్సిపల్ మాజీ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు ఆహ్వానం మేరకు ఆయన ఈ టీ-పార్టీకి హాజరైనట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ.. తమకు జరిగిన అన్యాయంపై థియేటర్ హక్కుదారులు తనను కలిశారన్నారు. గుడివాడ నడిబొడ్డులో ఇన్నాళ్ల అరాచకానికి అడ్డాగా వైసీపీ కార్యాలయం నిలిచిందని ఆరోపించారు. ఇక్కడకు రావాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి ఉండేదన్నారు. ఆఖరికి ముగ్గురు హక్కుదారులు థియేటర్ కు వస్తే కూడా వారు బెదిరింపులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొందన్నారు. ఇక ఇప్పటి నుండి గుడివాడ లో ఎలాంటి బెదిరింపులు ఉండవని..ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే తాట తీస్తామని హెచ్చరించారు.
Read Also : BRS MLC : కవిత కు తీవ్ర అస్వస్థత..హాస్పటల్ కు తరలింపు