Kate Winslet : టైటానిక్ హీరోయిన్ మొదటిలో ‘రోజ్’ పాత్రని వద్దు అనుకుందట.. కానీ తరువాత..!
టైటానిక్ మూవీలో లియోనార్డో డికాప్రియో (Leonardo DiCaprio), కేట్ విన్‌స్లెట్ (Kate Winslet) హీరో హీరోయిన్లుగా నటించారు.
- By News Desk Published Date - 10:00 PM, Tue - 29 August 23

వరల్డ్ ఫేమస్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ (James Cameron) రచించి, తెరకెక్కించిన కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ ‘టైటానిక్'(Titanic). 1912లో జరిగిన ఒక ప్రఖ్యాత షిప్ యాక్సిడెంట్ ని మెయిన్ స్టోరీగా తీసుకోని, దాని చుట్టూ ఒక అందమైన కథని అల్లుకొని ఆడియన్స్ ముందుకు ఒక అద్భుత కావ్యంగా తీసుకువచ్చాడు. థియేటర్ లో సినిమా విజువల్స్ ని, టైటానిక్ ప్రపంచాన్ని దర్శకుడు జేమ్స్ చూపించిన తీరుకి ఆడియన్స్ నోరు వెళ్ళబెట్టేలా చేసి ఔరా అనిపించింది. ఇక ఈ మూవీలో లియోనార్డో డికాప్రియో (Leonardo DiCaprio), కేట్ విన్‌స్లెట్ (Kate Winslet) హీరో హీరోయిన్లుగా నటించారు.
‘రోజ్’ పాత్రలో కేట్ విన్‌స్లెట్ అందాన్ని చూసి వరల్డ్ వైడ్ గా ప్రతి ఒక్కరు మైమరచిపోయారు. ప్రతి సీన్ లో ఆమె అందం అందరి మనసు దోచుకుంది. ఆమె రూపం మాత్రమే కాదు, నటన కూడా అందరి గుండెలను తాకింది. అయితే అటువంటి పాత్రని కేట్ విన్‌స్లెట్ ముందుగా వద్దు అనుకుందట. ఇందుకు కారణం కూడా ఒక ఇంటర్వ్యూలో కేట్ అభిమానులతో పంచుకుంది. జేమ్స్ కామెరూన్ తన టీంతో కలిసి రోజ్ పాత్ర కోసం ఆడిషన్ చేశాడు. ఈ ఆడిషన్ కి వందలమంది వచ్చారట. కాగా ఈ సినిమాకి ముందు కేట్ కి ఐదు సినిమాలు చేసిన అనుభవం ఉంది. తనకంటూ ఇండస్ట్రీలో ఒక గుర్తింపు ఉంది.
అయినా సరే అందరితో పాటు ఆడిషన్ లో పాల్గొని పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అయితే కేట్ విన్‌స్లెట్ యాక్ట్ చేసి చూపిస్తున్న సమయంలో ఆడిషన్ చేసే వ్యక్తి దానిపై తన అభిప్రాయం ఏంటో చెప్పకుండా కేవలం ‘హా’, ‘హ్మ్’ అని మాత్రమే బదులిచ్చాడట. పోనీ కేట్ ఆ వ్యక్తితో మాట్లాడడానికి ప్రయత్నించినా పట్టించుకోకుండా ప్రవర్తించాడట. దీంతో ఆమెకు చాలా చిరాకేసింది. వీళ్ళతో మనకి సెట్ అవ్వదని, అక్కడి నుంచి వెళ్ళిపోదాం అని ఫిక్స్ అయ్యింది. ఇక వెళ్లిపోయే సమయంలో మరో రౌండ్ ఆడిషన్ కోసం లోపలకి పిలిచారట. అలా లోపలకి వెళ్లిన కేట్ ని ఈ సారి డైరెక్టర్ ఆడిషన్ చేయడంతో టైటానిక్ హీరోయిన్ గా సెలెక్ట్ అవ్వడం రోజ్ పాత్రతో మన ముందుకి రావడం జరిగిపోయింది.
Also Read : Bhagavanth Kesari: భగవంత్ కేసరి సాంగ్ అప్ డేట్.. బాలయ్య, శ్రీలీల అదిరే స్టెప్పులు