Karthika Deepam : కార్తీక దీపం వంటలక్క ప్రస్తుతం ఎలా ఉంది ఏం చేస్తుందో మీకు తెలుసా?
స్టార్ మా లో ప్రసారమైన కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ తో భారీగా పాపులర్ సంపాదించుకుంది వంటలక్క.
- Author : Vamsi Chowdary Korata
Date : 27-01-2024 - 12:58 IST
Published By : Hashtagu Telugu Desk
Karthika Deepam : తెలుగు ప్రేక్షకులకు బుల్లితెర నటి ప్రేమి విశ్వనాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రేమి విశ్వనాథ్.. అంటే చాలామంది గుర్తుపట్టకపోవచ్చు కానీ వంటలక్క అంటే చాలు ఇట్టే గుర్తు పట్టేస్తారు. స్టార్ మా లో ప్రసారమైన కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ తో భారీగా పాపులర్ సంపాదించుకుంది వంటలక్క. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సీరియల్ కు భారీగా అభిమానులు ఉన్నారు. అంతేకాకుండా ఈమెకు స్టార్ హీరోయిన్ రేంజ్ లో అభిమానులు ఉన్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ బుల్లితెరపై సంచలనం సృష్టించింది.
We’re now on WhatsApp. Click to Join.
రికార్డు స్థాయిలో టీఆర్పి రేటింగ్స్ ను సాధించింది. ఒక్క సీరియల్ తోనే భారీగా పాపులారిటీని సంపాదించుకుంది ప్రేమి విశ్వనాథ్. ఇక ఈ సీరియల్ స్టార్ మా లో ప్రసారమవుతున్నంతసేపు అక్కడక్కడ కనిపించిన ఈమె ఒక్కసారిగా ఈ సీరియల్ అయిపోగానే కంటికి కనిపించకుండా పోయారు. మొన్న ఈమధ్య ఒక రెండు మూడు యాడ్స్ లో కనిపించింది కానీ పూర్తిస్థాయిలో ఈమె ఎక్కడ కనిపించడం లేదు. దాంతో ఆమె అభిమానులు ప్రేమి విశ్వనాథ్ ప్రస్తుతం ఏం చేస్తోంది? ఎక్కడ ఉంది అని ఆమె గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు.
స్టూడియో బాధ్యతలు చూసుకుంటూ అలా..
కాగా ప్రేమి విశ్వనాథ్ కార్తీకదీపం సీరియల్ తర్వాత తన సొంతూరు ఏర్నాకులం వెళ్లారు. అక్కడే తన స్టూడియో బాధ్యతల్నీ చూసుకుంటున్నారు. ఆమెకు అక్కడ రెండు స్టూడియోలు ఉన్నాయట. అంతేకాదు అడపా దడపా ఆమె కొన్ని తెలుగు సినిమాల్లోను, కొన్ని యాడ్స్‌లోను నటిస్తూ అదరగొడుతున్నారు. యాడ్స్ లో కూడా కార్తీకదీపం సీరియల్ ఫేమ్ నిరుపమ్ తో కలిసి పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే ఆమె మళ్ళీ తెలుగు సీరియల్స్ లోకి ఎంట్రీ ఇస్తే చూడాలని ఆమె అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. గత కొంతకాలంగా కార్తీకదీపం పార్ట్ 2 ఉంటుంది అంటూ ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఆ విషయంపై సరైన సమాచారం లేదు.
Also Read: Viral Pic : ఐదుగురు మనుమరాళ్ల మధ్య పద్మ విభూషణ్ చిరంజీవి