Viral Pic : ఐదుగురు మనుమరాళ్ల మధ్య పద్మ విభూషణ్ చిరంజీవి
- By Sudheer Published Date - 12:55 PM, Sat - 27 January 24

మెగా ఇంట మెగా సంబరాలు నెలకొన్నాయి. చిత్రసీమలో మెగాస్టార్ గా ఎంతో ఎత్తుకు ఎదిగిన చిరంజీవి.. తాజాగా పద్మ విభూషణ్ పుర్కస్కారం వరించింది. చిరంజీవికి పద్మ విభూషణ్ రావడం పట్ల మెగా అభిమానులతో పాటు చిత్రసీమ ప్రముఖులు , తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సంతోషాన్ని చిరంజీవి.. కుటుంబ సభ్యులతో పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. తాజాగాతన ఐదుగురు మనుమరాళ్లతో దిగిన ఫొటోను కోడలు ఉపాసన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘మీరు చూస్తున్నది శక్తివంతమైన పిడికిలిలోని ఐదు వేళ్లు. సినిమాలు, దాతృత్వంలోనే కాకుండా నాన్న, మామ, తాతగా మా అందరికీ స్ఫూర్తిగా నిలిచిన మామకు అభినందనలు’ అని రాసుకొచ్చారు. కాగా ఇందులోనూ క్లింకార ముఖం కనపడకుండా బ్లర్ చేయడం గమనార్హం.
We’re now on WhatsApp. Click to Join.
చిరంజీవి విషయానికి వస్తే..ఒక సామాన్య మధ్య తరగతి నుంచి తెలుగు సినీ రంగంలో తన కంటూ ఓ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు. స్వయంకృషి, స్వీయప్రతిభే చిరు కెరీర్ కు పునాదిరాళ్లుగా ఉపయోగపడ్డాయి. అడుగడుగునా సవాళ్లను అధిగమించి చరిత్ర సృష్టించిన విజేత.బాక్సాఫీసు రికార్డులు సృష్టించిన మగధీరుడు. ఆశేష అభిమానులకు మెగాస్టార్ చిరంజీవిగా అభిమానుల గుండెల్లో కొలువైనాడు. స్టార్ ఇమేజ్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసిన కథానాయకుడు చిరంజీవి. నటుడిగా 150పైగా చిత్రాలు చేసారు. అంతేకాదు సినీ కెరీర్ పీక్స్‌లో ఉండగానే..రాజకీయబాట పట్టాడు.ఎమ్మెల్యే అయ్యాడు. ఆపై రాజ్యసభ సభ్యుడు అయ్యారు. ఆపై కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం పాలిటిక్స్‌ను ఒదలిపెట్టి సినిమాలే లోకంగా బతుకున్నాడు. టాలీవుడ్ లో ఎన్టీఆర్,ఏఎన్నార్, కృష్ణ,కృష్ణంరాజు, శోభన్ బాబు వంటి స్టార్ హీరోల తర్వాత ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా మెగాస్టార్ గా ఎదిగిన వ్యక్తి చిరంజీవి. చిరు జీవితం వడ్డించిన విస్తరి కాదు. మొదట్లో ఎన్నో ఒడిదుడికులు..మరెన్నో విమర్శలు..ఆ తర్వాత ఆయన సినీ పరిశ్రమలో వచ్చిన ఒక్కోఅవకాశాన్ని వైకుంఠపాళి అనే సినీ పరిశ్రమలో పాము నోటికి చిక్కకుండా జాగ్రత్తగా నిచ్చెనలు ఎక్కి టాలీవుడ్ లో మెగాస్టార్ గా ఎదిగాడు.
అలాంటి మెగాస్టార్ సమాజం కోసం ఎన్నో సేవలు చేస్తూ వస్తున్నారు..విపత్తు సమయంలో కూడా తనవంతు సాయం అందజేస్తూ ప్రభుత్వం చేత గుర్తింపబడ్డారు. ఇక ఇప్పుడు ఏకంగా కేంద్రం పద్మ విభూషణ్ తో సత్కరించింది.
What you see are five fingers that form a powerful fist 👊 ❤️
Congrats to our inspiration, not just in cinema & philanthropy but in life – as a dad, father-in-law & granddad. Chirutha, honored with #PadmaVibhushan 🙏🙌 Love you 🥰 @KChiruTweets pic.twitter.com/3QHpuyPcxK— Upasana Konidela (@upasanakonidela) January 26, 2024
Read Also : Chiranjeevi – Venkaiah Naidu: ఒకరినొకరు సత్కరించుకున్న వెంకయ్య నాయుడు, చిరంజీవి.. ఫోటోస్ వైరల్?