kannappa : కన్నప్ప ఫస్ట్ డే కలెక్షన్ రిపోర్ట్
kannappa : ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే రూ.20 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు (Kannappa First Day Collections) సాధించగా, ఇండియాలోనే రూ.10 కోట్లకు మించి వసూళ్లు వచ్చినట్టు సమాచారం
- By Sudheer Published Date - 03:28 PM, Sat - 28 June 25

విష్ణు మంచు ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా మూవీ ‘కన్నప్ప’ (Kannappa )తొలి రోజే బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా, విడుదలైన వెంటనే హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే రూ.20 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు (Kannappa First Day Collections) సాధించగా, ఇండియాలోనే రూ.10 కోట్లకు మించి వసూళ్లు వచ్చినట్టు సమాచారం. ఈ సినిమా విష్ణు కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది.
వీకెండ్ ఎఫెక్ట్‌తో రెండో రోజు కూడా అదే జోరు కొనసాగుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు అద్భుతమైన స్పందన లభించింది. తొలి రోజే తెలుగు వెర్షన్‌లో సగటు ఆక్యుపెన్సీ 55.89 శాతంగా ఉండగా, రాత్రి షోలకు అది 69.87 శాతానికి పెరగడం గమనార్హం. ఈ విధంగా మొదటి రోజు నుంచే మంచి కలెక్షన్లు రాబడుతున్నందుకు చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా “ఇండస్ట్రీ హిట్‌గా అవతరించింది” అంటూ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేయడంతో, అది సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మోహన్ బాబు తన సొంత బ్యానర్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పై నిర్మించారు. విష్ణు సరసన ప్రీతి ముకుందన్ కథానాయికగా నటించగా, మోహన్ లాల్, మోహన్ బాబు, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి స్టార్ నటులు కీలక పాత్రల్లో నటించారు. తిన్నడు అనే చిన్నవాడి నుంచి పరమశివుడి మహాభక్తుడిగా కన్నప్పగా మారే ప్రయాణాన్ని హృద్యంగా చూపిస్తూ ఈ సినిమాను రూపుదిద్దారు. విశేషంగా నటించిన నటీమణులు, సంగీతం సినిమాకు స్పెషల్ హైలైట్‌గా నిలిచాయి.
Read Also : Travis Head: వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో హెడ్ భారీ రికార్డు.. ఏ ఆటగాడికి సాధ్యం కాలేదు!