కన్నడ హీరో పునీత్‌రాజ్‌కుమార్ మృతి
బెంగుళూరు - ప్రముఖ హీరో పునీత్ రాజ్‌కుమార్ మృతిచెందారు. ఉదయం వర్కవుట్ చేస్తున్న సమయంలో అతను ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో పునీత్‌ను దగ్గర్లోని రమణశ్రీ హాస్పిటల్‌లో చేర్పించారు. అయితే, పరిస్ధితి విషమించడంతో విక్రమ్ హాస్పిటల్‌కు షిఫ్ట్ చేశారు.
- By Hashtag U Published Date - 02:25 PM, Fri - 29 October 21

కన్నడ పవర్‌స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్(46) హఠాన్మరణం చెందారు. ఇవాళ ఉదయం 10 గంటలకు జిమ్ చేస్తున్న సమయంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో పునీత్‌ను దగ్గర్లోని రమణశ్రీ హాస్పిటల్‌లో చేర్పించారు. అయితే, పరిస్ధితి విషమించడంతో విక్రమ్ హాస్పిటల్‌కు షిఫ్ట్ చేశారు.
అప్పటికే పునీత్ చనిపోయాడని తెలుస్తున్నా కూడా ఆస్పత్రి వర్గాలు మాత్రం అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు అభిమానులు పెద్ద ఎత్తున విక్రమ్ హాస్పిటల్ దగ్గరకు చేరుకోవడంతో అక్కడ గంభీర వాతావరణం నెలకొంది.
మరోవైపు పునీత్ మృతికి సంతాపంగా కర్నాటకలో అన్ని ధియేటర్లు మూసివేశారు. ఆయన మృతదేహాన్ని బెంగుళూరులోని కంఠీరవ స్టేడియంలో సందర్శనార్ధం ఉంచనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కర్నాటక ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది.