HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Kangana Has Pledged All Her Assets For That Movie

kangana: ఆ సినిమా కోసం ఆస్తుల‌న్నీ తాక‌ట్టు పెట్టిన‌ కంగ‌నా!

బాలీవుడ్లో లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారిన క‌థానాయిక కంగ‌నా ర‌నౌత్ (kangana). కెరీర్లో కొన్నేళ్లు రెగ్యుల‌ర్ గ్లామ‌ర్ రోల్సే చేసిన ఆమె.. క్వీన్ ద‌గ్గ‌ర్నుంచి రూటు మార్చింది. ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ పెర‌గ‌డంతో ఆ త‌ర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కే ప‌రిమితం అయింది.

  • Author : Hashtag U Date : 22-01-2023 - 12:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kangana
Resizeimagesize (1280 X 720) (1)

బాలీవుడ్లో లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారిన క‌థానాయిక కంగ‌నా ర‌నౌత్ (kangana). కెరీర్లో కొన్నేళ్లు రెగ్యుల‌ర్ గ్లామ‌ర్ రోల్సే చేసిన ఆమె.. క్వీన్ ద‌గ్గ‌ర్నుంచి రూటు మార్చింది. ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ పెర‌గ‌డంతో ఆ త‌ర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కే ప‌రిమితం అయింది. మ‌ణిక‌ర్ణిక లాంటి సినిమాలు ఆమె ఇమేజ్‌ను మ‌రింత పెంచాయి. కానీ ఆ త‌ర్వాత కంగ‌నాకు వ‌రుస‌గా ఎదురు దెబ్బ‌లు త‌గులుతున్నాయి.

గ‌త ఏడాది కంగ‌నా ప్ర‌ధాన పాత్ర పోషించిన ధ‌క‌డ్ పెద్ద డిజాస్ట‌ర్ అయింది. దాదాపు వంద కోట్ల బ‌డ్జెట్లో తెర‌కెక్కిన ఈ చిత్రం థియేట‌ర్ల నుంచి ప‌దో వంతు కూడా వ‌సూలు చేయ‌లేక‌పోయింది. అయినా స‌రే.. కంగ‌నా త‌గ్గ‌ట్లేదు. మ‌ళ్లీ ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీని లైన్లో పెట్టింది. అదే.. ఎమ‌ర్జెన్సీ. ఈ చిత్రానికి ద‌ర్శ‌కురాలు, నిర్మాత కూడా కంగ‌నానే. ఈ సినిమా కోసం త‌న ఆస్తుల‌న్నీ తాక‌ట్టు పెట్టిన‌ట్లుగా కంగ‌నా ఓ ఇంటర్వ్యూలో వెల్ల‌డించ‌డం విశేషం.

Also Read: Akkineni Special: అందుకే అక్కినేని.. బుద్ధిమంతుడు..!

అనేక క‌ష్ట న‌ష్టాల‌కు ఓర్చి తాను ఎమ‌ర్జెన్సీ సినిమా తీసిన‌ట్లు కంగ‌నా తెలిపింది. ఎమ‌ర్జెన్సీ సినిమా షూటింగ్ పూర్త‌యిన సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ రోజు ఎమ‌ర్జెన్సీ షూట్ పూర్తి చేశాను. నా జీవితంలో అద్భుత ఘ‌ట్టం చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఈ సినిమా కోసం నేను ఏ క‌ష్టం ప‌డ‌లేద‌ని అంద‌రూ అనుకుంటున్నారు. కానీ వాస్త‌వం వేరు. నాకు సంబంధించిన ఆస్తుల‌న్నీ ఈ సినిమా కోసం తాక‌ట్టు పెట్టాను.

ఇక ఆరోగ్య ప‌రంగా ఈ సినిమా చేస్తూ చాలా ఇబ్బంది ప‌డ్డాను. డెంగీ బారిన ప‌డి ర‌క్త క‌ణాల సంఖ్య భారీగా ప‌డిపోయింది. అయినా త‌ట్టుకుని నిల‌బ‌డ్డాను. షూటింగ్‌కు హాజ‌ర‌య్యాను. ఈ స‌మ‌స్య‌ను అధిగ‌మించ‌డం చాలా క‌ష్ట‌మైంది. ఇది నాకు పున‌ర్జ‌న్మ అని కంగ‌నా పేర్కొంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • emergency
  • Kangana
  • Kangana Ranaut
  • Kangana Ranaut Emergency
  • Mortgage
  • properties

Related News

A Strong Counter to Trolls: Kangana Ranaut Stands by Aishwarya

Cannes 2026: ట్రోల్స్‌కు స్ట్రాంగ్‌ కౌంటర్.. ఐశ్వర్యకు అండగా నిలిచిన కంగనా రనౌత్

తనదైన ఫైర్‌బ్రాండ్ మాటలతో నిత్యం వార్తల్లో ఉండే బాలీవుడ్ నటి కంగనా రనౌత్, తాజాగా నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్‌కు మద్దతుగా నిలిచారు. ప్రతిష్ఠాత్మక క్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఐశ్వర్య ధరించిన డ్రెస్సింగ్‌పై సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలు, బాడీ షేమింగ్ ట్రోల్స్‌పై ఆమె తీవ్రంగా స్పందించారు. ఐశ్వర్య రాయ్ క్యాన్స్ లుక్‌కు సంబంధించిన ఫొటోను షేర్ చేస్తూ, ట్రోల్స్‌కు ఘాటుగా బద

    Latest News

    • TDP : టీడీపీ చూపిన బాటలో దేశ రాజకీయాలు మారబోతున్నాయి: ఎమ్మెల్యే మాధవిరెడ్డి

    • T- SAT : ALP అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టి-సాట్‌లో ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు

    • CM Revanth Reddy : ప్రజల భద్రతే లక్ష్యం.. కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ స‌ర్కార్‌

    • HYDRAA : పుప్పలగూడ‌ ముష్కిన్ చెరువులో హైడ్రా భారీ ఆపరేషన్..

    • BRS : మాజీ ఎమ్మెల్యే  బాల్కా సుమన్ అరెస్ట్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేసు నమోదు

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd