CSK vs RCB IPL : నేటి ఐపిఎల్ మ్యాచ్ లో ఇండియన్ 2 టీం.. కమల్ తో పాటు శంకర్ కూడా..!
CSK vs RCB IPL ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2024 లీగ్ మ్యాచ్ లు చివరి దశకు చేరుకున్నాయి. అయితే నేడు ఒక ఇంపార్టెంట్ మ్యాచ్ జరగనుంది.
- Author : Ramesh
Date : 18-05-2024 - 10:15 IST
Published By : Hashtagu Telugu Desk
CSK vs RCB IPL ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2024 లీగ్ మ్యాచ్ లు చివరి దశకు చేరుకున్నాయి. అయితే నేడు ఒక ఇంపార్టెంట్ మ్యాచ్ జరగనుంది. ప్లే ఆఫ్స్ కు వెళ్లేందుకు చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజ్ బెంగళూరు టీంస్ పోటీ పడుతున్నాయి. పాయింట్స్, రన్ రేట్ చెన్నైకే సపోర్ట్ చేస్తున్నా ఈ మ్యాచ్ గెలిస్తే సమీకరణాలు మారే ఛాన్స్ ఉంది. ఆర్సీబీ మాత్రం ఎలాగైనా ఈ మ్యాచ్ తో భారీ విజయాన్ని అందుకుని ప్లే ఆఫ్స్ కు వెళ్లాలని చూస్తుంది.
ఐపిఎల్ లవర్స్ అంతా కూడా నేడు జరిగే మ్యాచ్ పై ఆసక్తిగా ఉన్నారు. అయితే ఈ మ్యాచ్ ని తమ సినిమా ప్రమోషన్ కు వాడేందుకు సిద్ధమయ్యారు ఇండియన్ 2 టీం. కమల్ హాసన్, శంకర్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ కలిసి చేసిన ఇండియన్ 2 సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నేటి చెన్నై వర్సెస్ బెంగళూరు మ్యాచ్ కు ఇండియన్ 2 టీం అటెండ్ అవుతుంది.
పాతికేళ్ల క్రితం వచ్చిన ఇండియన్ సినిమా సెన్సేషనల్ హిట్ కాగా దానికి సీక్వెల్ గా చేసిన ఇండియన్ 2 సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇండియన్ 2 టీం ప్రమోషన్స్ కి ఐపిఎల్ కరెక్ట్ వేదిక అనుకుంది. అందుకే నేటి ఐపిఎల్ మ్యాచ్ లో వారు ప్రమోషన్స్ చేయనున్నారు.
అందరు కోలీవుడ్ వాళ్లే కాబట్టి కచ్చితంగా వారికి చెన్నై టీమే ఫేవరెట్ అవుతుంది. కానీ మ్యాచ్ బెంగళూరులో జరుగుతుంది కాబట్టి చిత్ర యూనిట్ ఆర్.సీ.బికి కూడా సపోర్ట్ అందించే ఛాన్సులు ఉన్నాయని చెప్పొచ్చు.
Also Read : Tiger Shroff : 30 కోట్ల నుంచి 9 కోట్లకు పడిపోయిన హీరో.. వరుస ఫ్లాపులతో కెరీర్ డైలమా..!