Kalki 2898 AD: కల్కి టిక్కెట్ రేట్ల పెంపును అనుమతించిన తెలంగాణ ప్రభుత్వం
కల్కి 2898 AD చిత్ర యూనిట్ కు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. జూన్ 27వ తేదీ ఉదయం 5.30 గంటలకు స్పెషల్ స్క్రీన్ షోకు అనుమతించింది. తెలంగాణ రాష్ట్రంలో విడుదలైన అన్ని థియేటర్లలో జూన్ 27 నుండి జూలై 4 వరకు ఎనిమిది రోజుల పాటు ఐదు షోలను ప్రభుత్వం అనుమతించింది.
- Author : Praveen Aluthuru
Date : 23-06-2024 - 1:07 IST
Published By : Hashtagu Telugu Desk
Kalki 2898 AD: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం కల్కి 2898 AD. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికీ విడుదలైన టీజర్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని హాలీవుడ్ స్థాయిలో నిర్మించారు. ఇక ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
కల్కి 2898 AD చిత్ర యూనిట్ కు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. జూన్ 27వ తేదీ ఉదయం 5.30 గంటలకు స్పెషల్ స్క్రీన్ షోకు అనుమతించింది. తెలంగాణ రాష్ట్రంలో విడుదలైన అన్ని థియేటర్లలో జూన్ 27 నుండి జూలై 4 వరకు ఎనిమిది రోజుల పాటు ఐదు షోలను ప్రభుత్వం అనుమతించింది. తాజాగా సవరించిన ధరలను చూస్తే బెనిఫిట్ షోకు 200 రూపాయలు పెంచింది. సింగిల్ స్క్రీన్స్ కు 70 రూపాయలు, మల్టిప్లెక్స్ లో 100 రూపాయలు పెంచారు
సాధారణ నిబంధనలు మరియు షరతులపై ప్రభుత్వానికి పన్ను చెల్లింపుకు లోబడి తాత్కాలికంగా అనుమతి మంజూరు చేయబడింది. కల్కి 2898 AD మూవీ స్క్రీనింగ్ కోసం మాత్రమే అనుమతి ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు మరియు లైసెన్సింగ్ అధికారులు మరియు సంబంధిత తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు కమిషనర్లు ఈ విషయంలో అవసరమైన తదుపరి చర్యలు తీసుకోవాలని అభ్యర్థించినట్లు పేర్కొంది.
పెరిగిన రేట్ల ప్రకారం కల్కి సినిమా టికెట్ ధరలు:
సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రత్యేక షోల ధరలు: రూ. 377
మల్టీప్లెక్స్ – రూ. 495
సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రెగ్యులర్ షోల ధరలు: రూ.265
మల్టీప్లెక్స్ – రూ. 413
Also Read: iPhone Price Cut: తక్కువ ధరకే ఐఫోన్.. ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్స్..!