Rajinikanth: జైలర్ సూపర్ సక్సెస్.. రజనీకాంత్ కి అదిరిపోయే BMW కారు గిఫ్ట్
తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ అన్ని చోట్లా దూసుకుపోతోంది.
- By Balu J Published Date - 03:11 PM, Fri - 1 September 23

తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ అన్ని చోట్లా దూసుకుపోతోంది. ఈ మూవీకి ఇతర సినిమాలేవీ పోటీగా లేకపోవడంతో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఇప్పటికే కేరళ, తమిళనాడులో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులు క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో ‘జైలర్’ చిత్రం ఘనవిజయం సాధించిందని సన్ పిక్చర్స్ ప్రకటించింది. ఈ సందర్భంలో చిత్ర నిర్మాత కళానిధి మారన్ దీనిని పురస్కరించుకుని రజనీకాంత్‌కు BMW X7 బహుమతిగా ఇచ్చారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన ‘జైలర్’ ఆగస్ట్ 10న విడుదలైంది. తమన్నా, రమ్యకృష్ణ, శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్, సునీల్, జాకీ ష్రాఫ్, యోగి బాబు, వసంత్ రవి తదితరులు నటించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు.
ఈ చిత్రం పాన్ ఇండియాలో విడుదలైంది. సన్ పిక్చర్స్ నిర్మించింది. ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సినిమా ఇప్పటి వరకు దాదాపు రూ.600 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, చిత్ర నిర్మాత కళానిధి మారన్, సినిమా విజయాన్ని పురస్కరించుకుని రజనీకాంత్‌కి BMW X7 కారును బహుమతిగా ఇచ్చారు. ఇది సర్ ప్రైజ్ గిఫ్ట్ గా ఇస్తారు. దీనికి సంబంధించిన వీడియోను సన్ పిక్చర్స్ విడుదల చేసింది.
రీసెంట్ గా సినిమా నిర్మాత కళానిధి మారన్ స్వయంగా లాభాలలో వచ్చిన అమౌంట్ ని రజినీకాంత్ కి ఇస్తూ ఫోటోని షేర్ చేశారు. సినిమా లాభాల్లో క్లియర్ వాటా ఎంత అనేది క్లియర్ గా చెప్పకున్నా ఈజీగా 15% రేంజ్ లో ఉంటుందని అంచనా.. సినిమా టోటల్ షేర్ 280 కోట్లకు పైగా ఉండగా అందులో 40 కోట్లకు పైగా రజినీకి వెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు. ఆ లెక్కన ఈ సినిమా తో రజినీకాంత్ ఓవరాల్ గా ఈ సినిమా కోసం 120 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ అందుకుని ఉండొచ్చని చెప్పాలి.
Also Read: Malayalam Actress: సౌత్ ఇండస్ట్రీలో విషాదం, ప్రముఖ మలయాళ నటి అపర్ణ ఆత్మహత్య