Malayalam Actress: సౌత్ ఇండస్ట్రీలో విషాదం, ప్రముఖ మలయాళ నటి అపర్ణ ఆత్మహత్య
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో విషాదం నెలకొంది. ప్రముఖ మలయాళ సినిమా, టీవీ నటి అపర్ణ పి నాయర్ కన్నుమూశారు.
- Author : Balu J
Date : 01-09-2023 - 1:45 IST
Published By : Hashtagu Telugu Desk
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో విషాదం నెలకొంది. ప్రముఖ మలయాళ సినిమా, టీవీ నటి అపర్ణ పి నాయర్ కన్నుమూశారు. గురువారం తిరువనంతపురంలోని కరమనాలోని తన నివాసంలో ఉరివేసుకుని మృతి చెందింది. అపర్ణ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అనంతరం ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఆమె వయస్సు 33 సంవత్సరాలు. ఆమె చేరిన ప్రైవేట్ ఆస్పత్రి నుంచి ఈ ఘటనపై తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు.
ఇది ఆత్మహత్యగా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఘటనపై వెంటనే విచారణ ప్రారంభించిన కరమన పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేశారు. అపర్ణ ‘చందన్మాల’, ‘ఆత్మస్కి’, ‘మైథిలీ వెండుమ్ వరమ్’ మరియు ‘దేవస్పర్శమ్’ వంటి టీవీ షోల ద్వారా అపర్ణ మంచి పేరు తెచ్చుకుంది . ఆమె ‘మెగాతీర్థం’, ‘ముత్తుగౌ’, ‘అచాయన్స్’, కోదాటి సమక్షం బాలన్ వాకిల్, ‘కల్కి’ వంటి చిత్రాల్లో కూడా నటించింది. అపర్ణకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ నటి మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: TSRTC Record: టీఎస్ఆర్టీసీ ఆల్ టైం రికార్డు, రాఖీ పౌర్ణమికి రూ.22.65 కోట్ల రాబడి