Kajal Boy: కాజల్ కొడుకు పేరు ‘నీల్ కిచ్లు’.. ఆ పేరుకు అర్థం ఇదే!
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.
- By Balu J Published Date - 03:26 PM, Wed - 20 April 22
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. కాజల్ ఆరోగ్యం బాగానే ఉంది. అయితే ఈ జంట తమ మగ బిడ్డకు ‘నీల్ కిచ్లు’ అని పేరు పెట్టారు. ఏప్రిల్ 19 ఉదయం జన్మించిన నీల్ ఈ దంపతులకు మొదటి సంతానం. నీల్ అంటే ఛాంపియన్ అని అర్థం. “నీల్ కిచ్లూ పుట్టినట్లు ప్రకటించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఏప్రిల్ 19, 2022. మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి. అభిమానులు, కుటుంబ సభ్యులు, సన్నిహితుల ప్రేమ, ఆశీర్వాదానికి ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.” అంటూ కాజల్ భర్త సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. కాజల్ 2020 అక్టోబర్లో గౌతమ్ని పెళ్లి చేసుకుంది.
It's a baby boy for #KajalAggarwal and #GautamKitchlu @MsKajalAggarwal #Entertainment #Bollywood https://t.co/B7AvsxUYBv
— Mid Day (@mid_day) April 19, 2022
Related News
NTR: బాలీవుడ్ కెరీర్ కోసం భారీ ప్లాన్స్ వేసిన ఎన్టీఆర్
NTR: ఎన్టీఆర్ తన కెరీర్ లో రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఒకటి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర, రెండోది అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వార్ 2. హృతిక్ రోషన్ కథానాయకుడిగా నటించిన ‘వార్ 2’ హిందీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి. ఎన్టీఆర్ తన పని తాను చేసుకుపోవడానికి ఓ టాప్ ఏజెన్సీని నియమించుకున్నట్లు తెలిసింది. ఈ సంస్థ ఆయనకు యాడ్స