Betting App Case : విజయ్ దేవరకొండను అరెస్ట్ చేయాలనీ KA పాల్ డిమాండ్
Betting App Case : ఇప్పటికే పలువురు నటీనటులు విచారణకు హాజరుకాగా, మరికొందరిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో KA పాల్ చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి
- By Sudheer Published Date - 01:04 PM, Mon - 24 March 25

బెట్టింగ్ యాప్ (Betting App Case) వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. సినీ ప్రముఖుల పేర్లు ఈ కేసులో వినిపించడంతో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్ (KAPaul) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ కేసుకు సంబంధించి విజయ్ దేవరకొండ(Vijay Devarakonda ), మంచు లక్ష్మి (Manchu Laxmi) సహా 25 మంది సెలబ్రిటీలను వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అక్రమ కార్యకలాపాలకు ప్రోత్సాహం అందించినవారికి కఠినమైన శిక్షలు పడాలని, న్యాయం కోసం తాను పోరాడతానని వెల్లడించారు.
Box Office : సినీ లవర్స్ కు ఈ వారం పండగే పండగ
ఈ వ్యవహారంలో పోలీసులు, రాజకీయ నాయకులు కొంతమంది సినీ ప్రముఖుల వద్ద డబ్బులు తీసుకుని వారిని వదిలేస్తున్నారనే ఆరోపణలు KA పాల్ చేశారు. తగిన చర్యలు తీసుకోకపోతే ఈ వ్యవహారాన్ని నేరుగా సుప్రీంకోర్టుకు తీసుకెళ్లి న్యాయపరమైన పోరాటం కొనసాగిస్తానని హెచ్చరించారు. ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ లాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరూ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసే విధంగా సినీ ప్రముఖులు ప్రవర్తించడం సమంజసం కాదని పాల్ అభిప్రాయపడ్డారు.
10th Paper Leak: ఆరుగురు అరెస్ట్!
బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ నటీనటుల పేర్లు బయటకు రావడంతో సినీ పరిశ్రమలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే పలువురు నటీనటులు విచారణకు హాజరుకాగా, మరికొందరిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో KA పాల్ చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి. ప్రజల్లో మార్పు తీసుకురావాలంటే ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని, ఎవ్వరైనా తప్పు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పకుండా తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.