HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Jeevitha Rajasekhar Lashes Out At Reviewers

Jeevitha Rajasekhar: రివ్యూయర్లపై జీవిత రాజశేఖర్ ఫైర్

  • Author : Vamsi Chowdary Korata Date : 04-04-2026 - 2:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jeevitha Rajasekhar Serious On Reviewers
Jeevitha Rajasekhar Serious On Reviewers

Biker Movie టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్, సీనియర్ హీరో రాజశేఖర్ కాంబినేషన్‌లో వచ్చిన క్రేజీ యాక్షన్ డ్రామా ‘బైకర్’ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఏప్రిల్ 3న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న నేపథ్యంలో, చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటి, నిర్మాత జీవిత రాజశేఖర్ రివ్యూయర్లపై చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు ఫిలింనగర్‌లో చర్చనీయాంశంగా మారాయి.

‘బైకర్’ సినిమా విజయోత్సవ సభలో జీవిత రాజశేఖర్ సినిమా రివ్యూల తీరుపై తన అసహనాన్ని వ్యక్తం చేశారు. సినిమా విశ్లేషణల విషయంలో రివ్యూయర్లు అనుసరిస్తున్న ధోరణిని జీవిత తప్పుబట్టారు. “సినిమాలో సెంటిమెంట్ ఎక్కువగా ఉంటే మెలోడ్రామా అని తీసిపారేస్తారు. అదే స్టైలిష్‌గా తీస్తే డెప్త్ లేదని అంటారు. అసలు ఏది నమ్మాలో మాకు అర్థం కావడం లేదు. సినిమా ఎలా తీయాలో ఇక రివ్యూయర్లనే అడుగుదామా అనిపిస్తోంది” అంటూ మండిపడ్డారు.

ఒక సినిమా వెనుక వందలాది మంది కష్టం, కోట్లాది రూపాయల పెట్టుబడి ఉంటుందని జీవిత గుర్తుచేశారు. రివ్యూలు చూసి నిర్ణయించుకోకుండా, ప్రేక్షకులు స్వయంగా థియేటర్లకు వెళ్లి సినిమా చూడాలని ఆమె విజ్ఞప్తి చేశారు. “నేను ‘బతుకు జట్కాబండి’ వంటి షోలు చేసినప్పుడు ఎన్నో వాస్తవ ఎమోషన్స్ చూశాను. ‘బైకర్’ సినిమాలో శర్వానంద్, రాజశేఖర్ గారు తమ కళ్లతోనే ఆ భావోద్వేగాలను అద్భుతంగా పలికించారు” అని కొనియాడారు.

షూటింగ్ ప్రారంభం నుంచి యూనిట్‌తో పాటే ప్రయాణించానని, దర్శకుడు అభిలాష్ రెడ్డి పడిన కష్టం తనకు తెలుసని, అందుకే థియేటర్‌లో కనురెప్ప వేయకుండా సినిమా చూశానని ప్రశంసించారు. చివరగా ఆమె ఒక కీలక సందేశాన్ని ఇచ్చారు. ఎవరితోనైనా మనస్పర్థలు ఉంటే మనసు విప్పి మాట్లాడుకోవాలని, ఎవరినీ దూరం పెట్టకుండా అందరితో సంతోషంగా ఉండటమే అసలైన జీవితమని పేర్కొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Abhilash Reddy
  • biker
  • Biker Review
  • jeevitha rajasekhar
  • Movie Reviews
  • Rajashekar
  • sharwanand
  • Telugu Cinema
  • tollywood

Related News

Good news for NTR fans: Time fixed for the 'God of War' announcement.

NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్​మెంట్​కు టైమ్ ఫిక్స్​

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్.. ‘గాడ్ ఆఫ్ వార్’ పేరుతో చాలా ఏళ్లుగా ఒక స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. మైథలాజికల్ జోనర్‌లో భారీ స్కేల్‌లో రూపొందించాలని ప్లాన్ చేసుకున్నారు. సితార నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ ప్రాజెక్టును ఎప్పుడో కన్ఫర్మ్ చేశారు. పలు సందర్భాల్లో ఈ మూవీ గురించి చెప్పి, అందరిలో ఆసక్తిని రేకెత్తించారు. జూనియర్ ఎన్టీఆర్ తో ఉంటుం

  • ‘Maa Inti Bangaram’ collections are shaking up the box office.

    Maa Inti Bangaram Overseas Collection: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మా ఇంటి బంగారం’ కలెక్షన్స్‌

Latest News

  • Cm ChandraBabu: సీఎం చంద్రబాబు రైతులకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు..

  • Shreyas Iyer: సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన ఐర్లాండ్.. శ్రేయాస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు

  • Rain Alert: తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు

  • Uric acid: కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయి? అయితే శరీరంలో ఇది జరిగి ఉండవచ్చు..!!

  • Lord Shiva: నీలకంఠునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఫలితం ఉంటుంది?

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd