Jayam Ravi : విడాకుల లిస్ట్ లో మరో హీరో.. భార్యతో విడిపోయిన తమిళ హీరో..
తమిళ్ హీరో జయం రవి తాజాగా నేడు తన భార్యతో విడిపోయినట్టు అధికారికంగా ప్రకటించాడు.
- By News Desk Published Date - 03:40 PM, Mon - 9 September 24

Jayam Ravi : ఇటీవల సినీ సెలబ్రిటీలు వరుసగా విడాకులు తీసుకుంటున్నారు. ఈ లిస్ట్ లో తాజాగా ఓ తమిళ్ హీరో చేరాడు. తమిళ్ హీరో జయం రవి తాజాగా నేడు తన భార్యతో విడిపోయినట్టు అధికారికంగా ప్రకటించాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన రవి.. నితిన్ జయం రీమేక్ సినిమాతో తమిళ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత హీరోగా నిలబడ్డాడు. ఇటీవల పొన్నియన్ సెల్వన్ తో పాన ఇండియా గుర్తింపు కూడా తెచ్చుకున్నాడు. పలు డబ్బింగ్ సినిమాలతో కూడా జయం రవి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.
జయం రవి – ఆర్తి ప్రేమించుకొని 2009లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెళ్లయిన 15 ఏళ్ళ తర్వాత ఇప్పుడు విడిపోతున్నట్టు అధికారికంగా ప్రకటించి విడాకులకు అప్లై చేసారు ఈ జంట. జయం రవి విడాకులు ప్రస్తుతం తమిళ చిత్రపరిశ్రమలో చర్చగా మారాయి. ఇక ఆర్తి తమిళ్ నిర్మాత సుజాత విజయ్ కుమార్ కూతురు. ఈమెకు పలు వ్యాపారాలు ఉన్నాయి. జయం రవి తండ్రి మోహన్ సీనియర్ సినిమా ఎడిటర్. అన్నయ్య మోహన్ రాజా దర్శకుడు.
జయం రవి తన భార్య ఆర్తితో విడిపోయినట్టు అధికారికంగా ప్రకటిస్తూ ఓ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసారు.
Grateful for your love and understanding.
Jayam Ravi pic.twitter.com/FNRGf6OOo8
— Jayam Ravi (@actor_jayamravi) September 9, 2024
Also Read : NTR Devara Event Guest : ఎన్టీఆర్ దేవరకు అతిథిగా ఎవరు..?