Jani Master Remand Report : నేరాన్ని అంగీకరించిన జానీ మాస్టర్
Jani Master Remand Report : 2020లో ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్టు జానీ మాస్టర్ అంగీకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు
- By Sudheer Published Date - 05:59 PM, Fri - 20 September 24

Jani Master Remand Report : లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ (Jani Master) కు 14 రోజుల రిమాండ్ (14 Days Remand) ను విధిస్తు ఉప్పర్ పల్లి కోర్ట్ (Upper Pally Court ) తీర్పు ఇచ్చింది. నాల్గు రోజుల క్రితం మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు పిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిర్యాదు నేపథ్యంలో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు..జానీ కోసం గాలింపు చర్యలు చేపట్టగా..అతడు గోవా లో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు నిన్న అక్కడికి చేరుకొని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుండి హైదరాబాద్ ఈరోజు తీసుకొచ్చారు. ఉదయం ఓ రహస్య ప్రదేశంలో జానీని విచారించారు. అనంతరం ఉప్పర్ పల్లి కోర్ట్ లో హాజరు పరచగా..వాదనలు విన్న కోర్ట్ 14 రోజుల రిమాండ్ కు ఆదేశించింది. ప్రస్తుతం జానీ మాస్టర్ చంచల్ గూడ జైల్లో ఉన్నాడు.
ఇక జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను పోలీసులు పొందుపరిచారు. రిమాండ్‌లో జానీ మాస్టర్ తన నేరాన్ని అంగీకరించారని పేర్కొన్నారు. ‘2019లో దురుద్దేశంతోనే బాధితురాలిని అసిస్టెంట్ గా చేర్చుకున్నారు. 2020లో ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్టు జానీ మాస్టర్ అంగీకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. తొలిసారి లైంగిక దాడి జరిగినప్పుడు ఆ యువతి వయస్సు 16 సంవత్సరాలే అని పోలీసులు తేల్చారు. గత నాలుగేళ్లుగా బాధితురాలిపై అనేకమార్లు లైంగిక దాడికి పాల్పడినట్టు రిమాండ్ రిపోర్టులో చేర్చారు. విషయం బయటకు చెబితే సినిమా ఆఫర్స్ రాకుండా చేస్తానని బెదిరించినట్లు పోలీసుల రిమాండ్ రిపోర్ట్‌లో ఉంది. తన పలుకుబడిని ఉపయోగించి బాధితురాలికి సినిమా చాన్సులు రాకుండా అడ్డుకున్నట్లు కూడా అందులో పేర్కొన్నారు. జానీ భార్య కూడా బాధితురాలిని బెదిరించిదని అందులో పొందుపరిచారు.
Read Also : Tirumala Laddu Controversy : కల్తీ నెయ్యి వ్యవహారమంతా కట్టు కథ – జగన్