Tirumala Laddu Controversy : కల్తీ నెయ్యి వ్యవహారమంతా కట్టు కథ – జగన్
Tirumala Laddu Controversy : టీటీడీకి అద్భుతమైన వ్యవస్థ ఉందని చెప్పడం మానేసి, చంద్రబాబు అబద్దాలు ఆడుతున్నారని మండిపడ్డారు
- By Sudheer Published Date - 05:48 PM, Fri - 20 September 24

Tirumala Laddu Controversy : తిరుమల లడ్డు వివాదం ఫై వైసీపీ అధినేత , మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన జగన్ (Jagan)..కూటమి సర్కార్ 100 రోజుల పాలనతో పాటు..లడ్డు ఇష్యూ ఫై రియాక్ట్ అయ్యారు.
తిరుమల లడ్డూ (Tirumala Laddu) విషయంలో సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు (Chandrbabu) అబద్ధాలు చెప్పడం న్యాయమేనా అని జగన్ ప్రశ్నించారు. టీటీడీకి అద్భుతమైన వ్యవస్థ ఉందని చెప్పడం మానేసి, చంద్రబాబు అబద్దాలు ఆడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో 2014-19 మధ్య 14 నుంచి 15 సార్లు రిజెక్ట్ చేశారు. వైసీపీ హయాంలో 18 సార్లు రిజెక్ట్ చేశారు. దీనికి సంతోషించాలి. ఓ మంచి ప్రాక్టీస్ ఉందని సంతోష పడాల్సింది పోయి… అబద్దానికి రెక్కలు కడుతున్నాం. జరగనిది జరిగినట్టు చెబుతున్నాం. అసలు ఇప్పుడు తిరుగుతున్న రిపోర్టులో జులై 12న శాంపిల్స్ తీసుకున్నారు. చంద్రబాబు హయాంలోనే శాంపిల్స్ తీసుకున్నారు. ఈ శాంపిల్స్‌ను జులై 17న ఎన్‌డీడీబీకి పంపించారు. వాళ్లు జులై 23న రిపోర్టు ఇచ్చారు. అప్పటి నుంచి చంద్రబాబు ఏం చేస్తున్నారు. వంద రోజుల పాలనప్పుడు ప్రజలు నిలదీస్తారనే ఇప్పుడు ఆ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఆ రిపోర్టుకు వక్రభాష్యం చెబుతూ నోటికి వచ్చిన అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు (Chandrababu) డైవర్షన్ రాజకీయాలు
‘దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగాలనే వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవరూ ఉండరు. 100 రోజుల చంద్రబాబు పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. అందుకే తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ పేరుతో డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. కల్తీ నెయ్యి వ్యవహారమంతా ఓ కట్టు కథ. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా చంద్రబాబు మాట్లాడారు’ అని జగన్ మండిపడ్డారు.
చంద్రబాబు కూల్చిన ఆలయాలను.మీమే పునరుద్ధరించాం – జగన్
తన పాలనలోని వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని జగన్ ఆరోపించారు. ‘ముంబై నటి కేసు, IPSల సస్పెన్షన్, మదనపల్లె ఫైళ్ల దగ్ధం ఘటనలతో డైవర్షన్ పాలిటిక్స్ తెరపైకి తెచ్చారు. విజయవాడ వరదలపై ముందస్తు చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వంపై విమర్శలు వస్తుంటే బ్యారేజీ గేట్ల వద్దకు బోట్లు వదిలారని అంటున్నారు. ఇప్పుడు తిరుమల నెయ్యి అంశాన్ని తెరపైకి తెచ్చారు’ అని జగన్ మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో కూల్చిన ఆలయాలు అన్నింటినీ తాము పునరుద్ధరించామని జగన్ అన్నారు. తిరుమలలో నవనీతసేత ప్రారంభించింది మా హయాంలోనే. పలు రాష్ట్రాల్లో TTD తరఫున ఆలయాలు నిర్మించింది మా ప్రభుత్వమే. TTD ఉద్యోగులకు స్థలాలిచ్చింది మేమే. ఏదైనా మంచి జరిగిందంటే అది వైసీపీ హయాంలోనే అని స్పష్టం చేసారు.
Read Also : TTD Laddu Issue: జగన్‌పై కేంద్రమంత్రులు ఫైర్