Janhvi Kapoor: అదిరేటిలో డ్రస్సులో జాన్వీ.. ఫ్యాషన్ ప్రియులు ఫిదా!
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) మరోసారి ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటోంది.
- Author : Balu J
Date : 30-12-2022 - 11:47 IST
Published By : Hashtagu Telugu Desk
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) గ్లామరస్ బ్యూటీ మాత్రమే కాదు స్టైల్ ఐకాన్ కూడా. ఈ బ్యూటీ కాస్ట్యూమ్స్ (Dressing) కు ఫిదా కానివారే ఉండరని చెప్పొచ్చు. జాన్వీ కూడా దుస్తుల ఎంపికలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ తన డ్రస్సింగ్ స్టైల్ తో ఆకట్టుకుంటోంది. లెహంగాలు, చీరలు, బికినీ, స్విమ్ సూట్ ఏదైనా సరే జాన్వీ కపూర్ కు అతికినట్టుగా సరిపోతోంది. అందుకే చాలామంది ఫ్యాషన్ ప్రియులు డ్రస్సింగ్ విషయంలో జాన్వీని ఫాలో అవుతుంటారు. 2022 ఇయర్ కు ఇంకొన్ని గంటల్లో గుడ్ బై చెప్పే సమయం వచ్చింది. చాలామంది కొత్త లక్ష్యాలు పెట్టుకుంటారు. అదిరిపొయే డ్రస్సింగ్ స్టైల్ తో అందరి ద్రుష్టి ఆకర్షించాలనుకుంటారు. అలాంటివాళ్ల కోసమే జాన్వీ (Janhvi Kapoor) పర్ఫెక్ట్ స్టైల్ ను అందిస్తోంది.
జాన్వీ కపూర్ అద్భుతమైన లెహంగాతో ఆకట్టుకుంది. అచ్చం యువరాణిలా ఉంది. తాన్యా ఘావ్రీ అనితా డోంగ్రే లెహెంగాలో మెరిసింది. ప్రస్తుతం జాన్వీ (Janhvi Kapoor) ఫొటోషూట్ ప్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటోంది. లెహంగాలోనూ తన అందాలను ప్రదర్శించి నెటిజన్స్ మనసు కూడా దోచింది. ఇక ఇటీవల రాజస్థాన్ లో జరిగిన అనంత్ అంబానీ ఎంగేజ్ మెంట్ వేడుకకు అటెండ్ అయ్యింది. పార్టీలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. లైట్ పింక్ కలర్ శారీ, స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో బాయ్‌ఫ్రెండ్ శిఖర్ పహరియా (Shikhar Pahariya)తో కలిసి హాజరైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.