Jailer Villain Arrest : జైలర్ మూవీ విలన్ అరెస్ట్.. ఎందుకు ?
Jailer Villain Arrest : రజనీకాంత్ సూపర్ హిట్ మూవీ ‘జైలర్’లో విలన్‌గా నటించిన వినయగన్ (వర్మన్) గుర్తున్నాడా ?
- Author : Pasha
Date : 25-10-2023 - 8:44 IST
Published By : Hashtagu Telugu Desk
Jailer Villain Arrest : రజనీకాంత్ సూపర్ హిట్ మూవీ ‘జైలర్’లో విలన్‌గా నటించిన వినయగన్ (వర్మన్) గుర్తున్నాడా ? ఆయనను కేరళలోని ఎర్నాకుళం నార్త్ పోలీసులు మంగళవారం సాయంత్రం అరెస్టు చేశారు. ఎర్నాకుళంలో వినయగన్ నివసిస్తుంటారు. వినయగన్ తాను నివసించే అపార్ట్‌మెంట్‌లోని ఇరుగుపొరుగు వారితో.. మద్యం మత్తులో దురుసుగా మాట్లాడారనే కంప్లయింట్ రావడంతో.. వెంటనే పోలీసులు స్టేషన్‌కు పిలిపించారు. అయితే ఆయన పోలీసు స్టేషన్‌కు వచ్చాక పోలీసులతోనూ దురుసుగా మాట్లాడారని తెలుస్తోంది. దీంతో వినయగన్‌ను పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించి పరీక్షించగా మద్యం మత్తులో ఉన్నట్లు తేలింది. దీంతో మద్యం మత్తులో పోలీసులతో, అపార్ట్‌మెంట్‌లోని వారితో దురుసుగా మాట్లాడారనే అభియోగాలతో కేసును నమోదు చేసి అరెస్టు చేశారు. ఈవిషయాన్నిపోలీసులు మీడియాకు వెల్లడించారు. అనంతరం బెయిల్ పై వినయగన్ విడుదలైనట్లు (Jailer Villain Arrest) తెలుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join.
వినాయకన్ మాలీవుడ్‌లో నటుడిగానే కాకుండా గాయకుడిగా మంచిపేర సంపాదించాడు. అతడు స్వరకర్త కూడా. వినాయకన్ ఎక్కువగా తమిళం, మలయాళం సినిమాల్లో నటిస్తున్నారు. జైలర్ మూవీతో సౌత్ సినిమా ఆడియన్స్‌కు కూడా కనెక్ట్ అయ్యాడు.ఈవిలక్షణ నటుడికి సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. తనకు సంబంధించిన వెరైటీ ఫోటోలు, వార్తలను అందరితో షేర్ చేస్తుంటాడు.