Salaar : ‘సలార్’ సినిమాపై జగపతిబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ప్రభాస్‌తో..
ప్రభాస్ కి బాహుబలి సినిమా తరవాత హిట్ లేకపోవడంతో ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా నుంచి వచ్చే అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
- Author : News Desk
Date : 16-07-2023 - 10:00 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) హీరోగా తెరకెక్కుతున్న సినిమా సలార్(Salaar). ఈ సినిమాలో శృతిహాసన్(Sruthi Haasan) హీరోయిన్ గా, జగపతి బాబు(Jagapathi Babu), పృద్విరాజ్ సుకుమారన్.. మరికొంతమంది స్టార్ యాక్టర్స్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేసి భారీ అంచనాలు పెంచారు. ఇక సలార్ సినిమా కూడా రెండు పార్టులుగా రానుందని, మొదటి పార్ట్ సెప్టెంబర్ 28న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు చిత్రయూనిట్.
దీంతో సలార్ సినిమాపై అభిమానులు మరిన్ని ఆశలు పెట్టుకుంటున్నారు. ప్రభాస్ కి బాహుబలి సినిమా తరవాత హిట్ లేకపోవడంతో ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా నుంచి వచ్చే అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా సలార్ సినిమాపై జగపతిబాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు.
జగపతి బాబు ఈ సినిమాలో రాజమన్నార్ అనే విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జగపతి బాబు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో జగపతి బాబు మాట్లాడుతూ.. సలార్ పార్ట్ 1లో నాకు, ప్రభాస్ కి ఒక్క సీన్ కూడా లేదు. మా కాంబినేషన్ లో సీన్స్ సలార్ పార్ట్ 1లో లేవు. నేను కూడా కొద్దిసేపే కనిపిస్తాను సలార్ పార్ట్ 1లో. సెకండ్ పార్ట్ లో మాత్రం మంచి యాక్షన్ సీన్స్ ఉంటాయి. ప్రభాస్ కి నాకు పార్ట్ 2లోనే కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి అని తెలిపారు. ఇక సలార్ సినిమా బాహుబలి కంటే ఓ రేంజ్ లో ఉంటుందని, పెద్ద హిట్ అవుతుందని అన్నారు జగపతిబాబు.