Jani Master Wife : జానీని వదిలేస్తా అంటూ భార్య సంచలన వ్యాఖ్యలు
Jani Wife Ayesha : అత్యాచారం జరిగిందనడానికి సాక్ష్యం ఏంటి..? మిగతా కొరియోగ్రాఫర్స్ తో ఎఫైర్ లేదని ఏంటి గ్యారంటీ ..? అమ్మాయి ప్రూఫ్స్ తీసుకొస్తే జానీని వదిలేసి వెళ్తా
- By Sudheer Published Date - 09:44 PM, Thu - 19 September 24

జానీ మాస్టర్ (Jani Master) లైంగిక వేధింపుల ఆరోపణలు ఇప్పుడు చిత్రసీమలో హాట్ టాపిక్ గా మారింది. ప్రతి ఒక్కరు దీని గురించి మాట్లాడుకుంటున్నారు. చిత్రసీమ కూడా జానీ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది కఠిన శిక్ష వేయాలని కోరుతుంటే..మరికొంతమంది మాత్రం నిజాలు బయటకు వచ్చేవరకు వెయిట్ చేయాలనీ..తప్పు చేస్తే శిక్ష విధించాలి అని అంటున్నారు. ఈ కేసులో జానీ భార్య ఆయెషా (Jani Master wife Ayesha)(సుమలత ) పేరును కూడా సదరు ఆరోపణలు చేస్తున్న కొరియోగ్రఫర్ పోలీసులకు పిర్యాదు చేయడం తో ఆమెను కూడా విచారించనున్నారు.
కాగా తన భర్త పై చేసిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని ఆయెషా చెపుతుంది. అత్యాచారం జరిగిందనడానికి సాక్ష్యం ఏంటి..? అంతకు ముందు ఆ అమ్మాయి షోస్ చేసినప్పుడు ఆ అమ్మాయికి చాలా మందితో ఎఫైర్స్ ఉన్నాయి. మిగతా కొరియోగ్రాఫర్స్ తో ఎఫైర్ లేదని ఏంటి గ్యారంటీ ..? మైనర్ గా ఉన్నప్పుడు రేప్ జరిగిందని చెప్తున్నది. ఆ అమ్మాయి ప్రూఫ్స్ తీసుకొస్తే జానీని వదిలేసి వెళ్తా అని సవాల్ చేసింది. అన్యాయం జరిగిందన్న దానివి ఎందుకు బయటకు వచ్చి మాట్లాడవు అని జానీ భార్య ప్రశ్నించింది. ఏ సాక్ష్యాలు ఉన్నాయో చూపించమనండి. బయటికి రమ్మనండి ఎక్కడో ఉండి నిరాధారమైన ఆరోపణలు చేయకూడదు గదా అని తెలిపింది.
తనకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని ఆ అమ్మాయి మాస్టర్ కు దగ్గరగా ఉండడం, అతనితో చనువుగా ఉంటుందని అంతా చెప్పేవారని తెలిపింది. మైనర్ గా ఉన్నప్పుడే అత్యాచారం జరిగితే జానీ మాస్టర్ దగ్గర వర్క్ చేయడం నా అదృష్టమని స్మైలీ ఫెస్ తో ఎలా తెలిపింది. ఆమెకు అవకాశాలు రాకుండా జానీ ఎప్పుడూ అడ్దుకోలేదు. యూనియన్ కార్డ్ ఇప్పించిందే జానీ మాస్టర్. హీరో శర్వానంద్ మూవీలో కొరియోగ్రాఫర్ గా అవకాశం ఇచ్చారు. ఆ అమ్మాయి వాళ్లు యూపీ నుంచి వచ్చారు. ఆ అమ్మాయికి తండ్రి లేడు. వాళ్ల అమ్మ ప్రెజర్ వల్ల ఇండస్ట్రీకి వచ్చింది. తల్లీకూతుళ్ల ప్రవర్తన ఆడవారికే కళంకం తెచ్చేలా ఉంటుంది. ఈ రోజు మహిళా సంఘాలు, ఇంకా ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారు. ఒక సైడ్ మాత్రమే వింటారా? నిజాలు తెలుసుకోకుండా అలా ఎలా డిసైడ్ చేస్తారంటూ ప్రశ్నించింది. లవ్ జిహాద్ అంటూ ఆరోపిస్తున్నారు. ఆయన అన్ని మతాలను గౌరవిస్తారు.
భారత్ కోసం ప్రాణాలు ఇచ్చే వ్యక్తి జానీ మాస్టర్ అని తెలిపింది. జానీ ప్రెసిడెంట్ అయ్యాక ఆ అమ్మాయికి మాస్టర్ కార్డు ఇవ్వాలని చెప్పారు. కానీ, కొంతమంది అడ్డుకున్నారు. కానీ ఆమెకు యూనియన్ లో కార్డు ఇప్పించేందుకు మేమిద్దరం ఫైట్ చేశాం అని తెలిపింది. కావాలనే జానీ మాస్టర్ పై కుట్ర చేస్తున్నారని ఆరోపించింది. 14 ఇయర్స్ నుంచి తనతో ఉంటున్నాను. తను తప్పుడు పనులు చేస్తుంటే నేను ఊరుకుంటానా అని చెప్పింది. ఎప్పుడో అత్యాచారం జరిగిందని చెప్తూ ఇప్పుడు కేసు పెట్టడమేంటీ? ఇంతకాలం ఎందుకు బయటికి రాలేదు. దీని వెనకాల ఉన్న కుట్ర ఏంటీ? అని ప్రశ్నించింది. మరి ఆయెషా వ్యాఖ్యలపై సదరు అమ్మాయి సమాదానాలు చెపుతుందా..? అనేది చూడాలి. ఏది ఏమైనప్పటికి ఓ నేషనల్ కొరియోగ్రాఫర్ పై ఇలాంటి వ్యాఖ్యలు రావడం అన్ని ఇండస్ట్రీల ప్రముఖులు మాట్లాడుకుంటున్నారు.
Read Also : Tirumala Laddu Controversy : హిందూ సంప్రదాయాలను జగన్ అవమానించాడు – రాజాసింగ్