IT Raids : సినీ నిర్మాతలు, డైరెక్టర్లపై మూడో రోజూ కొనసాగుతున్న ఐటీ రైడ్స్
తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం సినీ ఇండస్ట్రీతో సంబంధమున్న దాదాపు 15 మంది నివాసాల్లో ఐటీ రైడ్స్(IT Raids) జరుగుతున్నాయి.
- By Pasha Published Date - 09:33 AM, Thu - 23 January 25

IT Raids : టాలీవుడ్ నిర్మాతలు, డైరెక్టర్లు, సినీ నిర్మాణ సంస్థల భాగస్వాములపై ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం రైడ్స్ మూడో రోజు(ఇవాళ) కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఐటీ అధికారులు సంక్రాంతి సినిమా వసూళ్లకు సంబంధించిన ప్రతీ అంశాన్ని, ప్రతీ డాక్యుమెంటును క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. ఈక్రమంలోనే నిర్మాత దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని, డైరెక్టర్ సుకుమార్, మ్యాంగో మీడియా అధినేత రామ్, సినీ ఫైనాన్షియర్లకు చెందిన నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. పుష్ప మూవీ డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో వరుసగా రెండో రోజు(ఇవాళ) కూడా ఐటీ అధికారులు పత్రాలను పరిశీలిస్తున్నారు. నిర్మాత నెక్కంటి శ్రీధర్ నివాసంలోనూ రైడ్స్ జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం సినీ ఇండస్ట్రీతో సంబంధమున్న దాదాపు 15 మంది నివాసాల్లో ఐటీ రైడ్స్(IT Raids) జరుగుతున్నాయి. ఆయా సినీ నిర్మాణ సంస్థలకు చెందిన బ్యాంకు ఖాతాలు, స్థిరాస్తుల వివరాలను ఆదాయపు పన్ను అధికారులు తనిఖీ చేస్తున్నారు.
బ్యాంకు ఖాతాలు, స్థిరాస్తుల వివరాలను..
ఈ సంక్రాంతి పండుగకు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రెండు సినిమాలను విడుదల చేయగా భారీ కలెక్షన్లు వచ్చాయి. దీంతో దిల్ రాజు కుటుంబ సభ్యుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు జరుగుతున్నాయి. ఆయా సినిమాలకు సంబంధించిన బ్యాలెన్స్ షీట్లను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. దిల్ రాజు, మైత్రీ మూవీస్ చివరి సారిగా 2021లో బ్యాలెన్స్ షీట్లను సమర్పించినట్లు అధికారులు గుర్తించారు. దీంతో వారి సినిమాలకు ఫైనాన్స్ ఇచ్చిన కంపెనీల్లో ఐటీ అధికారులు మంగళవారం రోజు సోదాలు జరిపారు. మొత్తంమీద హైదరాబాద్ పరిధిలో సినీ రంగానికి చెందిన వారిపై రైడ్స్ కోసం ఆదాయపు పన్ను విభాగానికి చెందిన దాదాపు 65 టీమ్స్ పనిచేస్తున్నాయి.
Also Read :Political Legacy : లోకేశ్ రాజకీయ వారసత్వంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఈ కలెక్షన్లు చూడండి..
- డిసెంబరులో విడుదలైన పుష్ప-2 సినిమా రూ.1800 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది. పుష్ప మూవీ డైరెక్టర్‌గా సుకుమార్ వ్యవహరించారు.
- సంక్రాంతి పండుగకు రిలీజ్ అయిన గేమ్ చేంజర్ మూవీ రూ.350 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.
- జనవరి 12న విడుదలైన డాకు మహరాజ్ మూవీ రూ.100 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించింది.
- జనవరి 14న రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా రూ.200 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించింది.