HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Inside Allu Arjuns Luxurious Lifestyle A Private Jet A Customised Vanity Slew Of Cars And More

Allu Arjun: అల్లు అర్జునా మజాకా.. విలాసాల్లోనూ ‘ఐకాన్’ స్టార్!

మీరూ పుష్ప సినిమా చూశారా.. అందులో ఒక డైలాగ్ ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంది. ‘‘బ్రాండ్ అంటే బట్టల్లో ఉండదు.. బతకడంలో ఉంటుంది’’ ఈ డైలాగ్ ను అటుఇటుగా, ఇటుఅటుగా మార్చితే అల్లు అర్జున్ కు అతికినట్టుగా సరిపోతోంది!

  • By Balu J Published Date - 03:51 PM, Wed - 12 January 22
  • daily-hunt
Allu Arjun1
Allu Arjun1

అల్లు అర్జున్.. నటనకు పర్యాయపదంగా చెప్పక తప్పదు. అల్లు అరవింద్ వారుసుడిగా తేరంగేట్రం చేసినా.. తనకంటూ ప్రత్యేకమైన పేరు సంపాదించుకున్నాడు. ఆర్య, పరుగు, దేశముదురు, అలవైకుంఠపురం, పుష్ప లాంటి సినిమాలతో ఆకట్టుకున్నాడు. తాజాగా పుష్ప విజయంతో ఫుల్ జోష్ లో ఉన్నాడు ఈ హీరో. ఈ సినిమా స్ట్రీమింగ్ కోసం ‘అమెజాన్ ప్రైమ్’ 30 కోట్లు అఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. రీసెంట్ గా బాలీవుడ్ ఆఫర్ ఒకటి బన్నీని తలుపుతట్టినా.. తగ్గేదేలే అంటూ రిజెక్ట్ చేశాడు. అందుకు కారణం.. సెకండ్ రోల్ కావడమే. అయితే ఈ హీరో సినిమాకు కోసం ఎంత ఇంపార్ట్ నెస్ ఇస్తారో… వ్యక్తిగత లైఫ్ కు అంతే ప్రాధాన్యం ఇస్తారు. టాలీవుడ్ హీరో పాన్ ఇండియా హీరోగా అప్ గ్రేడ్ అయిన ఈ హీరో లగ్జరీ లైఫ్ లోనూ తన మార్క్ ను చూపిస్తున్నాడు.

1

డిసెంబర్ 2020లో అల్లు అర్జున్ చైతన్య, నిహారిక కొణిదెల వివాహానికి హాజరయ్యేందుకు ఉదయ్‌పూర్‌కు వెళ్లినప్పుడు.. తన కుటుంబంతో కలిసి విమానంలో బయలుదేరినప్పుడు తన ప్రైవేట్ జెట్‌ను పరిచయం చేశాడు. ఏ పెద్ద సెలబ్రిటీకైనా లగ్జరీ కార్లు ఉండటం సహజమే. కానీ అర్జున్ కు హమ్మర్ H2తో పాటు, రేంజ్ రోవర్ వోగ్, జాగ్వార్ XJL, వోల్వో XC90 T8 ఎక్సలెన్స్ లాంటి ఖరీదైన కార్ల తన గ్యారెజ్ లో కనిపిస్తాయి. సాధారణంగా సినిమాలు హీరోలు సెట్స్ అడుగుపెడితే.. వాళ్లతో పాటే వ్యక్తిగత కార్వాన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఇక అల్లు అర్జున్ కార్వాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సకల సౌకర్యాలతో కూడిన అద్భుతమైన కార్వాన్ ఉంది. దాని పేరు ది ఫాల్కన్. దానిపై AA లోగో ప్రత్యేకార్షణగా నిలిచి ఉంటుంది. ఇక జెట్ కూడా మెడర్న్ టెక్నాలజీతో ఆకట్టుకుంటోంది. వెండి, నలుపు రంగు ఫర్నిషింగ్‌తో అట్రాక్టివ్ గా ఉంటుంది.

3

 

అల్లు అర్జున్ వాడే కార్లు, జెట్స్ ఎంత ఖరీదైనవో.. అంతకుమించి హైదరాబాద్‌లోని ఇల్లు కూడా సకల సౌకర్యాలతో ఆకట్టుకుంటుంది. అల్లు అర్జున్ ఇల్లును కూడా కొన్ని సినిమా షూటింగ్స్ వాడారంటే.. ఎంత ప్రత్యేకంగా డిజైన్ చేశారో అర్థమవుతోంది. అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహరెడ్డి సలహాలు, సూచనలతో ఆ ఇల్లు డిజైన్ చేయబడిందట. లివింగ్ రూమ్‌ లో ఆకట్టుకునే అలంకరణలు, పిల్లల గదికి ప్రత్యేక డిజైన్స్, గెస్ట్ రూమ్స్, స్విమ్మింగ్ పూల్.. ఇలా ప్రతిదీ కావాల్సిన సౌకర్యాలతో ఏర్పాటైంది. హైదరాబాద్‌లోని అత్యంత విలాసవంతమైన సెలబ్రిటీ గృహాల్లో ఒకటి అని చెప్పక తప్పదు.

2

 

4

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • home tour
  • luxury life
  • private jet

Related News

Allu Arjun Released

Allu Arjun : ఫ్యాన్స్ కోసం అల్లు అర్జున్ కీలక నిర్ణయం

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun ) తన అభిమానుల కోసం మరోసారి సానుకూలమైన నిర్ణయం తీసుకున్నారు

  • Allu Arjun

    Allu Arjun : ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ రికార్డు!

Latest News

  • India- Russia: చైనాకు చెక్ పెట్టేందుకు సిద్ధ‌మైన భార‌త్‌- ర‌ష్యా?!

  • Deepotsav: ఢిల్లీ కర్తవ్య పథ్‌లో అద్భుత దీపోత్సవం.. ప్రారంభించిన సీఎం రేఖ గుప్తా!

  • Poisonous Fevers : ఏజెన్సీ గురుకులాలను వణికిస్తున్న విషజ్వరాలు

  • Air China Flight : విమానంలో మంటలు

  • Fatty Liver: ఫ్యాటీ లివర్ సమస్యకు ఈ ఆహారాలతో చెక్ పెట్టండి!

Trending News

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd