HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Cinema
  • >Independence Day Special Tollywood Movies

Independence Day Special : దేశభక్తిని చాటి చెప్పిన తెలుగు చిత్రాలు..

ప్రేమ , క్రైమ్ , సొసైటీ, కామెడీ , థ్రిలర్ ఇలా అన్ని కోణాల సినిమాలు వస్తుంటాయి..ప్రేక్షకులను అలరిస్తుంటాయి

  • By Sudheer Published Date - 09:02 AM, Sun - 13 August 23
  • daily-hunt
Independence Day Spl
Independence Day Spl

Independence Day : టాలీవుడ్ లో ప్రతి వారం ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ప్రేమ , క్రైమ్ , సొసైటీ, కామెడీ , థ్రిలర్ ఇలా అన్ని కోణాల సినిమాలు వస్తుంటాయి..ప్రేక్షకులను అలరిస్తుంటాయి. అలాగే దేశభక్తి ని చాటిచెప్పే చిత్రాలు కూడా అప్పుడప్పుడు వస్తుంటాయి. ఇప్పటివరకు ఆలా వందలాది చిత్రాలు వచ్చాయి. కానీ ప్రేక్షకుల్లో దేశభక్తిని నింపిన చిత్రాలు మాత్రం కొన్నే ఉన్నాయి. ఆలా దేశభక్తిని చాటి చెప్పిన తెలుగు చిత్రాలు ఏంటో చూద్దాం.

అల్లూరి సీతారామరాజు  (Independence Day 2023 ):

సూపర్ స్టార్ కృష్ణ హీరోగా 1974లో విడుదలైన తెలుగు సినిమా అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు జీవితాన్ని ఆధారం చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో కృష్ణ, విజయనిర్మల, కొంగర జగ్గయ్య ప్రధాన పాత్రల్లో నటించగా, ఘట్టమనేని హనుమంతరావు, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు నిర్మించారు. సినిమాలో కొంతభాగానికి వి.రామచంద్రరావు దర్శకత్వం వహించి మరణించగా, మగిలిన చిత్రానికి కృష్ణ, పోరాట సన్నివేశాలకు కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వంలో పూర్తిచేశారు. ఈ చిత్రంలో మన్యం వీరుడి స్వాతంత్ర్య పోరాటాన్ని అద్భుతంగా చూపించారు. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో చూపించిన అభినయం ప్రేక్షకులను కట్టిపడేసింది.

బ్రిటీష్ పరిపాలన పట్ల చిన్ననాటి నుంచీ వ్యతిరేకత పెంచుకున్న రామరాజు దేశాటన చేసి ప్రజల కష్టాలు, పోరాటాలు తెలుసుకుంటాడు. సీత అనే అమ్మాయిని ప్రేమించి, దేశసేవ కోసం పెళ్ళి చేసుకోకపోవడంతో ఆమె మరణించగా ఆమె పేరులోని సీతను స్వీకరించి సీతారామరాజు అవుతాడు. ఆపైన మన్యం ప్రాంతంలో గిరిజనులపై బ్రిటీష్ వారి దోపిడీకి వ్యతిరేకంగా సీతారామరాజు నేతృత్వంలో, గంటందొర, మల్లుదొర వంటి స్థానిక వీరుల మద్దతుతో ప్రజా విప్లవం ప్రారంభమవుతుంది. బ్రిటీష్ వారు ప్రజలను హింసించడం తట్టుకోలేక సీతారామరాజు లొంగిపోయి మరణించడంతో సినిమా ముగుస్తుంది.

కృష్ణ 100వ సినిమాగా విడుదలైన అల్లూరి సీతారామరాజు ఘన విజయాన్ని సాధించి 19 కేంద్రాల్లో వందరోజులు ఆడింది. ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం, ఆఫ్రో-ఏషియన్ చలనచిత్రోత్సవంలో ప్రదర్శన-బహుమతి వంటివి పొందింది. సినిమాలో తెలుగు వీర లేవరా పాట రాసినందుకు శ్రీశ్రీకి ఉత్తమ సినీ గీత రచయితగా జాతీయ పురస్కారం లభించింది. ఈ సినిమాను సినీ విమర్శకులు కృష్ణ సినీ జీవితంలో మైలురాయిగా పేర్కొంటూంటారు.

‘బొబ్బిలి పులి’ (1982) (Independence Day 2023 ) :

నందమూరి తారకరామారావు – దాసరి నారాయణరావు కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం.. ఒక మిలటరీ అధికారి స్టోరీతో రూపొందింది. ఈ చిత్రం అప్పట్లో సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. అదే సమయంలో ఎంతో మందిని చైతన్య వంతం చేసింది. ముఖ్యంగా ఈ చిత్రం ఎన్టీఆర్ కనబరిచిన నటనకు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. బొబ్బిలి పులి చిత్రానికి జేవి రాఘవులు అద్భుతమైన సంగీతం అందించారు. ఈ చిత్రంలోని పాటలన్ని సూపర్ హిట్. ముఖ్యంగా ఆర్మీ నేపథ్యంలో వచ్చే జననీ జన్మభూమి పాట అప్పటికీ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ దేశ భక్తి గీతంగా నిలిచిపోయింది. హీరో మేజర్ చక్రధర్. ఇతను సమాజంలో అవినీతి, లంచగొండితనాన్ని భరించలేక నక్సలైట్ అవతాడు. ఆ తర్వాత సంఘానికి పట్టిన చీడ పురుగులను ఎలా ఏరివేసాడనేదే ఈ సినిమా స్టోరీ.

మరో ప్రపంచం (1970) (Independence Day 2023 ):

ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వర్రావు, సావిత్రి, జమున ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమే ‘మరో ప్రపంచం’. దేశ భక్తితో పాటు అసలైన స్వాతంత్ర్యం, స్వేచ్చ, సామాజిక అసమానతలు, పేదరికం, వివక్ష వంటి వాటిని ప్రస్తావిస్తూ తీసిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లోని ఎంతో మందిని చైతన్యవంతం చేసింది.

మేజర్ చంద్రకాంత్ (1993) (Independence Day 2023 ):

ఎన్. టి. రామారావు, మోహన్ బాబు, శారద, రమ్య కృష్ణ, నగ్మా ప్రధాన పాత్రలలో తెరకెక్కిన మూవీ మేజర్ చంద్రకాంత్. ఈ మూవీ కమర్షియల్ హంగులతో కూడిన దేశ భక్తిని కూడా సినీ లోకానికి చాటి చెప్పి కలెక్షన్ల వర్షం కురిపించింది.

పరంవీర చక్ర అవార్డు పొందిన ధైర్యవంతుడైన సైనికుడు మేజర్ చంద్రకాంత్ (ఎన్.టి.రామారావు) ఘోరమైన ఉగ్రవాది జికె (రాఖీ) నుండి విదేశీ పర్యాటకులను రక్షించే ఆపరేషన్లో, అతని సన్నిహితుడు మేజర్ రాజశేఖర్ (ఎం.బాలయ్య) దురదృష్టవశాత్తు తీవ్రంగా గాయపడతాడు.రాజశేఖర్ చనిపోయే ముందు మేజరు చంద్రకాంత్ తన కుమార్తె సీత (నగ్మా) ను రాజశేఖర్ కుమారుడు శివాజీ (మోహన్ బాబు) తో వివాహం జరిపిస్తానని వాగ్దానం చేస్తాడు. మరి వివాహం జరిపించాడా లేదా..? ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి అనేది సినిమా కథ. ఈ సినిమాలో పుణ్యభూమి నాదేశం అనే సాంగ్ ఎవర్ గ్రీన్ గా నిలిచింది. రిపబ్లిక్ డే , ఇండిపెండెన్స్ డే లలో ఈ సాంగ్ తప్పకుండ వినిపిస్తుంది.

ఖడ్గం (2002) (Independence Day 2023 ) :

కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన దేశభక్తి మూవీ ఇది. శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్, సోనాలి బెంద్రే, సంగీత, కిమ్ శర్మ, షఫీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని సుంకర మధుమురళి కార్తికేయ మూవీస్ పతాకంపై నిర్మించాడు. దేశ భక్తికి సరైన అర్థం చెప్పేలా పూర్తి స్థాయి భావోద్వేగాలతో రూపొందిన ఈ సినిమా ప్రస్తుత తరం వాళ్ల మెప్పును పొందింది. కమర్షియల్‌గానూ సక్సెస్ కావడంతో పాటు ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. దీంతో ప్రతి ఇండిపెండెన్స్‌డేకు ఈ చిత్రం టీవీలలో ప్రసారం అవుతుంటుంది. ఇక ఈ మూవీ లో మీమే ఇండియన్స్ ..అనే సాంగ్ ఎప్పటికి మారుమోగిపోతూనే ఉంటుంది.

RRR (2022) (Independence Day 2023 ):

అల్లూరి సీతారామరాజు, కొమరం భీం కథలతో రూపొందిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఇందులో దేశ భక్తికి స్నేహాన్ని కూడించి చూపించారు. ఫలితంగా ఇది దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లోనూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని.. ఆస్కార్‌ను కూడా అందుకుంది. కె. వి. విజయేంద్ర ప్రసాద్ అసలు కథను ఇవ్వగా, రాజమౌలి ఈ చిత్రానికి స్క్రిప్ట్ ఇచ్చారు. ఈ చిత్రంలో ఎం. ఎం. కీరవాణి స్వరపరిచిన స్కోరు, సౌండ్‌ట్రాక్ ఉన్నాయి. కె.కె.సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫీ డైరెక్టర్, అక్కినేని శ్రీకర్ ప్రసాద్ ప్రసాద్ ఎడిటర్. ప్రొడక్షన్ డిజైనర్‌గా సాబు సిరిల్ సంతకం చేయగా, వి.శ్రీనివాస్ మోహన్ విజువల్ ఎఫెక్ట్‌లను పర్యవేక్షిస్తారు. కాస్ట్యూమ్ డిజైనింగ్ రామ రాజమౌళి చేస్తారు. సాయిమాధవ్ బుర్రా ఈ చిత్రానికి డైలాగులు అందించారు. వీటి తో పాటు మరికొన్ని చిత్రాలు ఉన్నాయి. చిరంజీవి సైరా, ఠాగూర్ , వెంకటేష్ సుభాష్ చంద్రబోస్ , కృష్ణవంశీ మహాత్మా , రాజశేఖర్ వందే మాతరం, ఎన్టీఆర్ సర్దార్ పాపారాయుడు , విజయశాంతి నేటి భారతం . ఇలా మన తెలుగు లో దేశ భక్తిని చాటి చెప్పిన చిత్రాలు ఇవి.

Read Also : Janaushadhi Kendras-Railway Stations : సికింద్రాబాద్, తిరుపతి రైల్వే స్టేషన్లలో జనౌషధి కేంద్రాలు


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • alluri seetarama raju
  • independence day
  • Independence Day 2023
  • independence day tollywood movies
  • Khadgam
  • rrr

Related News

    Latest News

    • Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్

    • Drugs : హైదరాబాద్లో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ గుట్టు రట్టు

    • CM Revanth Reddy : నిమజ్జనంలో సడన్ ఎంట్రీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

    • Maharashtra : శృంగారానికి ఒప్పుకోలేదని కాబోయే భార్యను రేప్ చేసి హతమార్చాడు

    • AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd