HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >If You Insult Pawan Kalyan Every Day You Will Get The Post Of Mlc

పవన్ కళ్యాణ్ ను రోజు తిడితే ఎమ్మెల్సీ పదవి !!

గతంలో ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి తనను పిలిపించి, ఎమ్మెల్సీ (MLC) పదవి ఆఫర్ చేశారని ఆయన పేర్కొన్నారు. అయితే, ఆ పదవి దక్కాలంటే ప్రతిరోజూ ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్‌ను విమర్శించాలనే షరతు పెట్టారని, దానికి తాను ససేమిరా అన్నట్లు బండ్ల గణేష్ వివరించారు

  • Author : Sudheer Date : 04-02-2026 - 11:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan Kalyan
Pawan Kalyan

Bandla Ganesh – Pawan Kalyan : టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ తన ముక్కుసూటితనానికి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పట్ల తనకు ఉన్న అచంచలమైన భక్తికి మరోసారి నిదర్శనంగా నిలిచారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆయన ఇంటర్వ్యూలో ఒక సంచలన విషయాన్ని వెల్లడించారు. గతంలో ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి తనను పిలిపించి, ఎమ్మెల్సీ (MLC) పదవి ఆఫర్ చేశారని ఆయన పేర్కొన్నారు. అయితే, ఆ పదవి దక్కాలంటే ప్రతిరోజూ ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్‌ను విమర్శించాలనే షరతు పెట్టారని, దానికి తాను ససేమిరా అన్నట్లు బండ్ల గణేష్ వివరించారు.

పదవుల కోసం సిద్ధాంతాలను, ఇష్టదైవంగా భావించే వ్యక్తిని వదులుకునే ప్రసక్తే లేదని బండ్ల గణేష్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. “నా శరీరం బూడిద అయిపోయినా, ఆ బూడిద కూడా పవన్ కళ్యాణ్‌ను తిట్టదు” అంటూ ఆయన ఇచ్చిన సమాధానం ఇప్పుడు మెగా అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. రాజకీయ ప్రలోభాలకు లొంగకుండా, తన అభిమానాన్ని చాటుకోవడం ద్వారా బండ్ల గణేష్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆ ఆఫర్ ఇచ్చింది ఏ పార్టీ నాయకుడు అనే విషయాన్ని ఆయన గోప్యంగా ఉంచినప్పటికీ, ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి.

మరోవైపు, బండ్ల గణేష్ ప్రస్తుతం తన ఆధ్యాత్మిక సంకల్పాన్ని నెరవేర్చుకునే పనిలో ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు జైలు నుంచి క్షేమంగా బయటకు రావాలని కోరుకుంటూ మొక్కుకున్న ఆయన, ఇప్పుడు ఆ మొక్కు తీర్చుకోవడానికి షాద్‌నగర్ నుండి తిరుమల వరకు పాదయాత్ర చేపట్టారు. ఇప్పటికే 16 రోజులుగా కొనసాగుతున్న ఈ యాత్ర, ఆయన పట్టుదలకు అద్దం పడుతోంది. సినిమాలు, రాజకీయాలు ఎలా ఉన్నా.. తన నమ్మకాల విషయంలో వెనక్కి తగ్గేది లేదని నిరూపిస్తున్న బండ్ల గణేష్ వైఖరిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

నా బాడీ బూడిద అయినా గానీ ..పవన్ కళ్యాణ్ ను తిట్టదు ,, అది బండ్ల గణేష్ అన్న అంటే 🔥🔥 #BandlaGanesh #PawanKalyan pic.twitter.com/MCyFFjVgxC

— Vasundhara (@VasundharaOff) February 2, 2026


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bandla ganesh
  • bandla ganesh-pawan kalyan
  • MLC Offer
  • Pawan Kalyan
  • politics
  • పవన్ కళ్యాణ్
  • బండ్ల గణేష్

Related News

Pawan Kalyan Campaign In Mu

తెలంగాణ మున్సిపల్ బరిలోకి దిగుతున్న పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎన్నికల ప్రచార బరిలోకి దిగాలని నిర్ణయించుకోవడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నెల 11న జరగనున్న 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల ఎన్నికల్లో భాగంగా.. జనసేన మరియు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఆయన ప్రచారం నిర్వహించనున్నారు.

  • Bolli Shetty Satyanarayana

    జనసేనకు బిగ్ షాక్ ఇచ్చిన కీలక నేత..అయోమయంలో పార్టీ శ్రేణులు !!

  • Pawan Is Angry Over Liquor

    మద్యం ధరలపై పవన్ ఆగ్రహం !!

  • Pawan Praises Modi's Leader

    మోడీ నాయకత్వంపై పవన్ ప్రశంసలు..ఫిదా అంటున్న బిజెపి శ్రేణులు

  • Pawan Lokesh Frd

    ఇది కదా స్నేహమంటే !! పవన్ గురించి చెపుతూ నారా లోకేశ్ ఎమోషనల్

Latest News

  • వైఎస్ జగన్ హిందూ ద్రోహి.. జనసేన ఎమ్మెల్సీ నాగబాబు సంచలన వ్యాఖ్యలు

  • ఏపీలోని స్కూల్, కాలేజీ విద్యార్థులకు గుడ్‌న్యూస్..

  • లోన్ యాప్ వేధింపులకు మరో ప్రాణం బలి

  • ముగ్గురు అక్కాచెల్లెళ్ల ప్రాణాలను బలి తీసుకున్న లవ్ గేమ్ !!

  • బంగారం వెండి ధరలకు రెక్కలు ..రూ.6 వేలు పెరిగిన బంగారం, రూ.14 వేలు పెరిగిన వెండి

Trending News

    • మరణానికి ముందు అతనికి ఫోన్ కాల్.. అజిత్ పవార్ చివరి మాటలు ఇవే !

    • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

    • వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

    • పాకిస్థాన్‌పై ఐసీసీ క‌ఠిన చ‌ర్య‌లు?!

    • పీఎఫ్ ఖాతాదారుల‌కు మ‌రో శుభ‌వార్త‌..!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd