Srinidhi Shetty : మహేష్ తో డై&నైట్ చేస్తా – శ్రీనిధి
Srinidhi Shetty : శ్రీనిధి శెట్టి నటించిన తాజా చిత్రం ‘తెలుసు కదా’ ఈ నెల 17న విడుదల కానుంది. ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.
- Author : Sudheer
Date : 05-10-2025 - 8:30 IST
Published By : Hashtagu Telugu Desk
కేజీఎఫ్ (KGF) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమైన హీరోయిన్ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్టార్ హీరోలైన మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం ఒకేసారి వస్తే పగలు, రాత్రి రెండుశిఫ్ట్లు చేసినా కష్టమనిపించదని ఆమె స్పష్టం చేశారు. ఇది ఆమె కృషి పట్ల ఉన్న నిబద్ధతను, స్టార్ హీరోలతో పని చేయాలనే తపనను ప్రతిబింబిస్తుంది.
Coldrif Syrup : తెలంగాణలో కోల్డ్ డ్రాప్ సిరప్ నిషేధం
తాను దేవుడిని నమ్ముతానని, ఎప్పటికప్పుడు గుడులకు వెళ్తుంటానని శ్రీనిధి చెప్పింది. ఈసారి ప్రత్యేకంగా కేరళలోని ప్రసిద్ధ గురువాయూరపన్ దేవాలయానికి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. తాను ఎంత బిజీ షెడ్యూల్‌లో ఉన్నా ఆధ్యాత్మికతకు సమయం కేటాయించడం చాలా ఇష్టమని ఆమె వ్యాఖ్యలు అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
శ్రీనిధి శెట్టి నటించిన తాజా చిత్రం ‘తెలుసు కదా’ ఈ నెల 17న విడుదల కానుంది. ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇందులో ఆమె నటన, కొత్త లుక్ ప్రేక్షకులకు భిన్నమైన అనుభూతిని కలిగించబోతుందని చిత్రబృందం చెబుతోంది. ఈ మూవీ విజయం సాధిస్తే, శ్రీనిధి శెట్టి కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.